Unstoppable: బాలయ్య-చిరంజీవి ఎపిసోడ్‌ చేయలేకపోవడానికి కారణమదే..

నందమూరి బాలకృష్ణ మొదటిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌ స్టాపబుల్‌’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ షో 40 కోట్ల స్ట్రీమింగ్‌ నిమిషాలతో ‘ఆహా మోస్ట్‌ వాచ్డ్‌ షో’గా గుర్తింపు తెచ్చుకుంది....

Updated : 09 Feb 2022 15:46 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ మొదటిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించిన సెలబ్రిటీ టాక్‌ షో ‘అన్‌ స్టాపబుల్‌’. ‘ఆహా’ ఓటీటీ వేదికగా ప్రసారమైన ఈ షో 40 కోట్ల స్ట్రీమింగ్‌ నిమిషాలతో ‘ఆహా మోస్ట్‌ వాచ్డ్‌ షో’గా గుర్తింపు తెచ్చుకుంది. ‘అన్‌స్టాపబుల్‌’ అద్భుతమైన ప్రేక్షకాదరణ పొందడంపై ఆ షో క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ బీవీఎస్‌ రవి ఆనందం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ఈ షోపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షో కోసం మొదటిసారి బాలకృష్ణను డైరెక్ట్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ‘అన్‌స్టాపబుల్‌’ సక్సెస్‌కు ముఖ్య కారణం బాలయ్యే అని తెలిపారు.

‘అన్‌స్టాపబుల్‌’లో బాలకృష్ణ-చిరంజీవి ఎపిసోడ్‌ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఎందుకు పెట్టలేదు అన్న ప్రశ్నకు .. ‘‘అక్టోబర్‌ 27న ‘అన్‌స్టాపబుల్‌’ ఫస్ట్‌ ఎపిసోడ్‌ షూట్‌ చేశాం. నవంబర్‌ 3న బాలకృష్ణ భుజానికి చిన్న సర్జరీ జరిగింది. కొన్ని వారాలు షూట్‌ చేయలేదు. అదే సమయంలో చిరంజీవి మూడు సినిమాల చిత్రీకరణలు మొదలయ్యాయి. దీంతో చిరు బిజీ అయిపోయారు. డేట్స్‌ దొరకలేదు. ఈ కారణంగానే బాలయ్య-చిరంజీవి ఎపిసోడ్‌ షూట్ చేయడం కుదరలేదు. ఒకవేళ అదే జరిగి ఉంటే ఈ షో మరో లెవల్‌లో ఉండేది. తదుపరి సీజన్‌లో అయినా వీరిద్దరి ఎపిసోడ్‌ ఉంటుందేమో చూడాలి. సీజన్‌-2 ఎప్పుడు ప్రారంభమవుతుందో నాకు పూర్తిగా తెలీదు’’ అని రవి తెలిపారు.

అనంతరం ఇటీవల హరీశ్‌ శంకర్‌-రవి మధ్య జరిగిన ట్వీట్ల వార్‌పై విలేకరి ప్రశ్నించగా.. ‘‘హరీశ్‌ శంకర్‌కు నాకు మధ్య మంచి సత్సంబంధాలున్నాయి. మేమిద్దరం క్లోజ్‌ ఫ్రెండ్స్‌. అప్పుడప్పుడూ సినిమాలు, టూర్స్‌కి వెళ్తుంటాం. ‘బావా బావా’ అని పిలుచుకుంటాం. మేమిద్దరం ఎంత స్నేహితులమైనప్పటికీ మా ఇద్దరికీ విభిన్నన్నమైన రాజకీయ అభిప్రాయాలున్నాయి. దానివల్లే మా ఇద్దరి మధ్య ఆ రోజు వరుస ట్వీట్లు నడిచాయి. మేము చేసుకున్న ట్వీట్స్‌ని చూసి పలువురు నెగెటివ్‌ కామెంట్లు చేయడం ప్రారంభించారు. అవి, చూశాక.. అర్థమైంది. మా ట్వీట్లని వేరే వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని. మా ఇద్దరి మధ్య వార్‌ జరుగుతుందనుకుంటున్నారని. మా ఇద్దరి మధ్య అలాంటి గొడవలేమీ లేవు. మేమిద్దరం మంచి స్నేహితులమే. అలాగే, ఆ రోజు నేను చేసిన ట్వీట్‌ సినిమా టికెట్‌ వ్యవహారాన్ని ఉద్దేశిస్తూ కాదు. దాని గురించి మాట్లాడే స్థాయి నాకు లేదు’’ అని రవి వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని