Tollywood: నాకు వ్యక్తిగత అజెండాలేమీ లేవు: దిల్‌రాజు

తనకి ఎలాంటి వ్యక్తిగత అజెండాల్లేవని, కేవలం సినిమాల కోసం మాత్రమే తాను పనిచేస్తానని ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు(Dilraju) అన్నారు. సినిమా షూటింగ్స్‌ (Tollywood) నిలిపివేసి....

Updated : 04 Aug 2022 16:03 IST

హైదరాబాద్‌: తనకి ఎలాంటి వ్యక్తిగత అజెండాల్లేవని, కేవలం సినిమాల కోసం మాత్రమే పనిచేస్తానని ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాత దిల్‌ రాజు(Dilraju) అన్నారు. సినిమా షూటింగ్స్‌ (Tollywood) నిలిపివేసిన క్రమంలో గురువారం ఉదయం తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ప్రత్యేకంగా సమవేశమైంది. సమావేశం అనంతరం దిల్‌ రాజు మాట్లాడుతూ.. ‘‘టాలీవుడ్‌లో సమస్యల పరిష్కారం కోసం నాలుగు కమిటీలు ఏర్పాటు చేశాం. ఓటీటీ, వీపీఎఫ్‌ ఛార్జీలు, రెవెన్యూ పర్సంటేజీ, సినీ కార్మికుల వేతనాలు, నిర్మాణ వ్యయాలపై కమిటీలు పనిచేస్తున్నాయి. నెలల తరబడి షూటింగ్స్‌ ఆపే ఉద్దేశం నాకు లేదు. నిర్మాతలందరూ కలిసి నాపై బాధ్యతలు పెట్టారు. నాకు వ్యక్తిగత అజెండా ఏమీ లేదు. సినిమాల కోసం మాత్రమే నేను పనిచేస్తా’’ అని దిల్‌ రాజు తెలిపారు. అనంతరం సి.కల్యాణ్‌ మాట్లాడుతూ.. ‘‘సమస్యల పరిష్కారం కోసమే నిరవధికంగా షూటింగ్స్‌ బంద్‌ చేశాం. నిర్మాతల మధ్య ఎటువంటి బేధాభిప్రాయాల్లేవు. నిర్మాతల మండలి, ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ లక్ష్యం ఒకటే. సమస్యలు పరిష్కరించుకోవడమే’’  అని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని