Capital A Small a: ‘తారే జమీన్‌ పర్‌’ చిన్నోడు ఇప్పుడెలా ఉన్నాడో చూశారా..!

తారే జమీన్‌ పర్‌ సినిమాలో అలరించిన చిన్నోడు ఇప్పుడు హీరో అయ్యాడు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది.  

Published : 18 Nov 2022 15:57 IST

హైదరాబాద్: దర్శీల్ సఫారీ(Darsheel Safary) ఈ నటుడి ఈ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ‘తారే జమీన్‌ పర్’‌. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు దర్శీల్‌. అప్పట్లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. అందులో అత్యుత్తమంగా నటించిన ఆ చిన్నోడు ఇప్పుడు హీరో అయ్యాడు. తాజాగా ఓ షార్ట్‌ ఫిల్మ్‌లో నటించాడు. ‘క్యాపిటల్‌ ఎ స్మాల్‌ ఎ’ అనే ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఈ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. టీనేజ్‌లో పుట్టే ప్రేమ ఆధారంగా ఈ షార్ట్‌ ఫిల్మి తెరకెక్కింది. ట్రైలర్‌లో ఆదిగా దర్శీల్‌, ఆంషిగా రేవతిల నటన ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది. సురేష్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అమెజాన్‌ మినీటివిలో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా దర్శీల్‌ మాట్లాడుతూ కరోనా కారణంగా తన జీవితంలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని అన్నాడు. జాన్వీకపూర్‌ సరసన నటించాలని ఉందని తన కోరికను చెప్పాడు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని