Captain Miller: 1940ల నాటి ‘కెప్టెన్‌ మిల్లర్‌’

ధనుష్‌ కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’.

Updated : 23 Sep 2022 06:53 IST

క్లాప్‌ క్లాప్‌

ధనుష్‌ (Dhanush) కథానాయకుడిగా అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ చిత్రం ‘కెప్టెన్‌ మిల్లర్‌’. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్‌ మోహన్‌ కథానాయిక. సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా గురువారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను చిత్ర బృందం సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది. ‘‘ధనుష్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. 1930-40ల నేపథ్యంలో సాగే పీరియాడికల్‌ సినిమాగా ఉంటుంది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది’’ అని చిత్ర బృందం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని