Indian 2: ‘భారతీయుడు 2’కు కొత్త చిక్కు.. విడుదల ఆపాలంటూ పిటిషన్‌

‘భారతీయుడు 2’ విడుదల ఆపాలంటూ ఓ పిటిషన్‌ దాఖలైంది. ఏం జరిగిందంటే?

Published : 10 Jul 2024 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) చిత్రానికి మరో చిక్కు ఎదురైంది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్‌ రాజేంద్రన్‌ (Aasaan Rajendran) మదురై జిల్లా కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఈ సినిమాలో వినియోగించారని.. థియేటర్‌, ఓటీటీలోనూ రిలీజ్‌ కాకుండా నిషేధం విధించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈమేరకు బుధవారం కోర్టులో విచారణ జరిగింది. దీనిపై స్పందించాలని ‘భారతీయుడు 2’ చిత్ర బృందానికి మరికొంత సమయం ఇస్తూ కోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

ప్రాచీన యుద్ధకళల్లో ఒకటైన మర్మకళలో రాజేంద్రన్‌ ప్రసిద్ధుడు. ఆయన రాసిన పుస్తకం చదివి స్ఫూర్తిపొందిన దర్శకుడు శంకర్‌ (Shankar) ‘భారతీయుడు’లో మర్మకళకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు తెరకెక్కించారు. సేనాపతి పాత్ర కోసం నటుడు కమల్‌హాసన్‌ (Kamal Haasan)కు రాజేంద్రన్‌ ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘భారతీయుడు 2’లో తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ వినియోగించుకున్నారనేది రాజేంద్రన్‌ వాదన.

1996లో విడుదలై ఘన విజయం అందుకున్న ‘భారతీయుడు’కు సీక్వెల్‌ను ఆరేళ్ల క్రితమే ప్రారంభించారు. కొవిడ్‌/లాక్‌డౌన్‌, సెట్స్‌లో అగ్ని ప్రమాదం.. ఇలా ఊహించని పలు ఘటనలతో వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఈనెల 12న విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు మరో సమస్య ఎదురవడం గమనార్హం.

‘భారతీయుడు’ కోసం ఈ తెలుగు హీరోలను అనుకున్నారు కానీ..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని