RGV: దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదైంది. తన దగ్గర డబ్బు అప్పుతీసుకుని ఆర్జీవీ తిరిగి ఇవ్వలేదంటూ శేఖర్‌రాజు అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు.

Published : 24 May 2022 01:09 IST

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ (Ram Gopal Varma)పై కేసు నమోదైంది. తన దగ్గర డబ్బు అప్పు తీసుకుని ఆర్జీవీ తిరిగి ఇవ్వలేదంటూ శేఖర్‌రాజు అనే వ్యక్తి కూకట్‌పల్లి కోర్టును ఆశ్రయించారు. ‘దిశ’ సినిమా నిర్మాణం కోసం ఆర్జీవీ తన వద్ద రూ. 56 లక్షలు తీసుకున్నారని, వాటిని తిరిగి ఇవ్వకుండా బెదిరించారని శేఖర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ అనంతరం, ఆర్జీవీపై కేసు నమోదు చేయాలని కూకట్‌పల్లి కోర్టు పోలీసు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఐపీసీ 406, 407, 506 సెక్షన్ల కింద ఆర్జీవీపై మియాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని