Cashpromo: ‘రైల్వే స్టేషన్‌లో పెళ్లి చూపులు’

రైల్వే స్టేషన్‌లో పెళ్లి చూపులు పెడితే ఎలా ఉంటుంది. రైల్వే స్టేషన్‌లో జనాలు ఉంటారు కదా.. అక్కడ పెళ్లి చూపులెలా సాధ్యం అనుకుంటున్నారా..? మన యాంకర్‌ సుమ తలచుకుంటే సాధ్యమే మరి. సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమంలో నటులు ఇంద్రజ, ప్రియదర్శి, అనసూయ, అభినవ్‌ గోమటం పాల్గొని సందడి చేశారు.

Published : 28 Jun 2021 01:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వే స్టేషన్‌లో పెళ్లి చూపులు పెడితే ఎలా ఉంటుంది. రైల్వే స్టేషన్‌లో జనాలు ఉంటారు కదా..! అక్కడ పెళ్లి చూపులెలా సాధ్యం అనుకుంటున్నారా..? మన యాంకర్‌ సుమ తలచుకుంటే సాధ్యమే మరి. సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమంలో నటులు ఇంద్రజ, ప్రియదర్శి, అనసూయ, అభినవ్‌ గోమటం పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ‘రైల్వే స్టేషన్‌లో పెళ్లి చూపులు’ స్కిట్‌ కడుపుబ్బా నవ్వించింది.  ఆ తర్వాత సుమ వేసిన ప్రశ్నలు.. అతిథులు చెప్పిన సరదా సమాధానాలు అలరించేలా ఉన్నాయి. కరోనా సమయంలో మీకు తోడుగా ఉన్న స్నేహితుల గురించి పంచుకోవాలనుకుంటే చెప్పొచ్చని సుమ అడగ్గా.. ‘ది రిలేషన్‌షిప్‌ బిట్‌వీన్‌ సుమ అండ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌. బట్‌ నాట్‌ సుమ అండ్‌ కరోనా పాండమిక్‌’ అని ప్రియదర్శి చెప్పాడు. తాను స్నేహితుడినే పెళ్లి చేసుకున్నానని అనసూయ చెప్పగా.. తాను మాత్రం తన భర్తనే పెళ్లి చేసుకున్నానని ఇంద్రజ చెప్పడంతో నవ్వులు పూశాయి. ప్రియదర్శిని ఉద్దేశిస్తూ.. విజయ్‌ దేవరకొండ, నవీన్‌ పొలిశెట్టి ఈ ఇద్దరిలో మీ కామెడీ టైమింగ్‌కు అందుకోగలిగే హీరో ఎవరూ అని ప్రశ్నించగా.. అభినవ్‌ కల్పించుకొని.. ‘ఎవరూ కాదు.. ఎందుకంటే .. నీకు కామెడీ టైమింగ్‌ లేదు’ అని పంచ్‌ వేశాడు. ఈ పూర్తి కార్యక్రమం జులై 3న ప్రసారం కానుంది. అప్పటి వరకూ ప్రోమో చూసి ఆనందించండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని