Cash: హరిత కోసం జాకీ చేసిన త్యాగాలేంటో తెలుసా?

తన కోసం జాకీ బీర్‌ తాగడం మానేశాడని, ఇలా జీవితంలో చాలా త్యాగాలు చేశారని బుల్లితెర నటి, జాకీ సతీమణి హరిత అన్నారు.

Published : 09 Aug 2021 01:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన కోసం జాకీ బీర్‌ తాగడం మానేశాడని, ఇలా జీవితంలో చాలా త్యాగాలు చేశారని బుల్లితెర నటి, జాకీ సతీమణి హరిత అన్నారు. సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ఎంటర్‌టైనింగ్‌ షో ‘క్యాష్‌: దొరికినంత దోచుకో’. ఆగస్టు 14న ప్రసారమయ్యే కార్యక్రమానికి హరిత-జాకీ, ప్రీతి నిగమ్‌-నగేష్‌ జోడీలు వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా సుమ అడిగిన ప్రశ్నలకు నగేష్‌-ప్రీతి జోడి సరదా సమాధానాలు ఇచ్చింది. భార్య గొప్పా.. భర్తలు గొప్పా.. అన్న ప్రశ్నకు నగేష్‌ ఇచ్చిన సమాధానానికి ప్రీతి అదిరిపోయే పంచ్‌ ఇవ్వడంతో అందరూ పగలబడి నవ్వారు. ఇక ప్రీతి గురించి నగేష్ కవిత చెప్పడం, దానికి జాకీ తనదైన టైమింగ్‌తో చురకలు అంటించడంతో సెట్‌లో ఉన్నవాళ్లందరూ నవ్వాపుకోలేకపోయారు. వీరి సందడి చూడాలంటే ఆగస్టు 14 వరకూ వేచి చూడాల్సిందే. అప్పటివరకూ ఈ సరదా ప్రోమోను చూసేయండి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని