Cash Promo: ఏం మిస్‌ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది: గోపీచంద్‌

‘‘నా తొమ్మిదేళ్ల వయసులో నాన్న చనిపోయారు. నేను ఏం మిస్‌ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది. నాన్న బతికి ఉన్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయాన్ని ఎందుకు గడపలేకపోయానా?....

Published : 26 Jun 2022 13:27 IST

హైదరాబాద్‌: ‘‘నా తొమ్మిదేళ్ల వయసులో నాన్న చనిపోయారు. నేను ఏం మిస్‌ అయ్యానో ఇప్పుడు తెలుస్తోంది. నాన్న బతికి ఉన్నప్పుడు ఆయనతో ఎక్కువ సమయాన్ని ఎందుకు గడపలేకపోయానా? అని ఇప్పుడు అనిపిస్తుంటుంది’’ అంటూ ఉద్వేగానికి గురయ్యారు నటుడు గోపీచంద్‌ (Gopichand). ఈటీవీలో(ETV) ప్రసారమయ్యే క్యాష్‌ (CASH) ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఆయన తన తండ్రి కృష్ణను గుర్తు చేసుకున్నారు. సుమ(Suma) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ ప్రోగ్రామ్‌లో తాజాగా ‘పక్కా కమర్షియల్‌’(Pakka Commercial) టీమ్‌ సందడి చేసింది. సినిమా రిలీజ్‌ సందర్భంగా గోపీచంద్‌, దర్శకుడు మారుతి (Maruthi), నిర్మాతలు బన్నీ వాసు, ఎస్‌కెఎన్‌ ఈ షోలో పాల్గొని తమ చిత్రాన్ని ప్రమోట్‌ చేశారు. చిత్రబృందంపై సుమ పంచులు.. దానికి మారుతి రివర్స్‌ కౌంటర్స్‌.. సుమ-గోపీచంద్‌ల ఫన్నీ స్కిట్స్‌తో ఇలా షో ఆద్యంతం ఫుల్‌ జోష్‌ఫుల్‌గా సాగింది. దీనికి సంబంధించిన సరికొత్త ప్రోమో తాజాగా విడుదలైంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని