Cash promo: అప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యా.. చిరంజీవి సాయం చేశారు: బండ్ల గణేశ్‌

‘‘కొవిడ్‌ మూడు వేవ్స్‌లోనూ నేను వైరస్‌ బారిన పడ్డాను. సెకండ్‌ వేవ్‌లో నా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. ఆసమయంలో చిరంజీవి గారే నన్ను ఆస్పత్రిలో చేర్పించి..

Published : 23 May 2022 01:32 IST

హైదరాబాద్‌: ‘‘కొవిడ్‌ మూడు వేవ్స్‌లోనూ నేను వైరస్‌ బారిన పడ్డాను. సెకండ్‌ వేవ్‌లో నా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. ఆసమయంలో చిరంజీవి గారే నన్ను ఆస్పత్రిలో చేర్పించి.. జాగ్రత్తగా చూసుకున్నారు’’ అంటూ ఆనాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు నిర్మాత బండ్ల గణేశ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘డేగల బాబ్జీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ‘డేగల బాబ్జీ’ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆ చిత్రబృందం సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘క్యాష్‌’ ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ఇందులో సుమ-బండ్ల గణేశ్‌ల వరుస పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. ‘టమాటాలు కేజీ ఎంత చెప్పండి’ అని సుమ అడగ్గా.. ‘‘అవన్నీ మాకు తెలియదు. కోడిగుడ్డు రేటు అడిగితే చెప్తా. కోడిగుడ్డు లేకపోతే లైఫే లేదు. నువ్వు ఇంత అందంగా ఉండటానికి నేను పంపించిన కోడిగుడ్లే కారణం’’, ‘‘ఈటీవీ పర్మినెంట్‌. క్యాష్‌ పర్మినెంట్‌. సుమ పర్మినెంట్‌ కాదు’’, అంటూ బండ్ల గణేశ్‌ వేసిన పంచులతో సెట్‌ అంతా సందడి వాతావరణం నెలకొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు