సుమ ఊళ్లో సంక్రాంతి.. చూశారా? 

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ ప్రోగ్రాం సందడే వేరు. ఈ వారం కార్యక్రమానికి అతిథులుగా నటీమణులు సంగీత, స్వాతి దీక్షిత్‌,కామ్నజెఠ్మలాని, ఇషా చావ్లా హాజరయ్యారు. తాజాగా ఆ ఎపిసోడ్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు.  సంక్రాంతి స్పెషల్‌గా

Updated : 11 Jan 2021 14:31 IST

హైదరాబాద్‌: సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమం సందడే వేరు. ఈ వారం కార్యక్రమానికి అతిథులుగా నటీమణులు సంగీత, స్వాతి దీక్షిత్‌, కామ్నా జెఠ్మలాని, ఇషా చావ్లా హాజరయ్యారు. తాజాగా ఆ ఎపిసోడ్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు. సంక్రాంతి స్పెషల్‌గా క్యాష్‌ సెట్‌ను పండగశోభను తలపించేలా అలంకరించారు. షోలో భాగంగా.. నవ్వకుండా నన్నే చూడాలంటూ యాంకర్‌ సుమ వారితో ఆడిన గేమ్‌ కడుపుబ్బా నవ్విస్తోంది. సంక్రాంతి సందర్భంగా గోదావరి జిల్లాల్లో చేసే ఏర్పాట్లను షోకి వచ్చిన అతిథులతో సరదాగా చేయించారు. నటి సంగీతాను బ్రేకింగ్‌ న్యూస్‌ పేరుతో సుమ కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా సంగీత స్పందిస్తూ మళ్లీ శ్రీకాంత్‌ అన్నయ్య పక్కన హీరోయిన్‌గా నటిస్తానని చెప్పారు. సుమ దానిపై చదివిన బ్రేకింగ్‌న్యూస్‌తో షోలోని వారంతా గట్టిగా నవ్వేశారు. ఈ సందడంతా మీరు చూడాలంటే వచ్చే శనివారం రాత్రి 9:30 వరకు వేచిచూడాల్సిందే. అప్పటిదాకా ఈ సంక్రాంతి స్పెషల్‌ ప్రోమోను చూసేయండి!

ఇవీ చదవండి!

చిరు.. పవన్‌.. వెంకీ.. అందరిదీ అదే దారి!

సోషల్‌ లుక్‌: తారల ‘సండే’ తళుకులు..!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని