CASH: సుమ కొత్త షాప్‌.. A TO Z హోమ్‌ నీడ్స్‌

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్‌.. దొరికినంత దోచుకో’. తరచూ సినీ తారలతో సందడిగా సాగే ఈ షోలో తాజాగా...

Updated : 20 Jun 2021 15:44 IST

హైదరాబాద్‌: యాంకర్‌ సుమ కొత్తగా ఓ షాప్‌ తెరిచారు. ‘సుమ ఏ టు జెడ్‌ హోమ్‌ నీడ్స్‌’ పేరుతో తెరిచిన ఈ దుకాణంలో అన్ని వస్తువులు లభిస్తాయట. అయితే, ఈ షాప్‌ను నిర్వహించే బాధ్యత సీరియల్‌ నటులు ప్రియాంక నాయుడు, రాజ్‌, మహేశ్వరి, రాజేశ్‌లకు అప్పగించారు. మరి వాళ్లు సుమ షాప్‌నకు ఏ విధంగా ప్రచారం చేశారు? అందుకు వాళ్లు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారు తెలియాలంటే వచ్చే శనివారం ప్రసారమయ్యే ‘క్యాష్‌’ చూడాల్సిందే.

సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఎంటర్‌టైన్‌మెంట్‌ గేమ్‌ షో ‘క్యాష్‌.. దొరికినంత దోచుకో’. తరచూ సినీ తారలతో సందడిగా సాగే ఈ షోలో తాజాగా బుల్లితెర నటీనటులు పాల్గొన్నారు. షోలో భాగంగా సుమ, రాజ్‌ల మధ్య జరిగే సంభాషణలు, మహేశ్వరిపై సుమ వేసే పంచులు నవ్వులు పూయించేలా ఉన్నాయి. వచ్చే శనివారం ప్రసారం కానున్న ఈ ఫుల్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని