Puneeth Rajkumar: పునీత్‌ ఆఖరి చిత్రం ప్రీమియర్‌‌.. థియేటర్‌లో ఉద్వేగభరిత క్షణాలు

పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన ఆఖరి చిత్రం ‘గంధద గుడి’. ఈ సినిమా షూట్‌ పూర్తైన కొన్ని నెలలకే పునీత్‌ హఠాన్మరణం పొందిన విషయం తెలిసిందే.

Published : 28 Oct 2022 14:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కన్నడ నటుడు, దివంగత పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) నటించిన ఆఖరి చిత్రం ‘గంధద గుడి’ (Gandhada Gudi). కర్ణాటక వైల్డ్‌ లైఫ్‌ని ఆధారంగా చేసుకుని ఓ డాక్యుమెంటరీ డ్రామాగా దీన్ని రూపొందించారు. అమోఘవర్ష దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం కన్నడ నటీనటులు, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా ప్రీమియర్‌ షో వేశారు.

సినిమా పూర్తైన వెంటనే ప్రేక్షకులు, సెలబ్రిటీలు భావోద్వేగానికి గురయ్యారు. అప్పుని గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా చూస్తుంటే గర్వంగా, సంతోషంగా ఉందన్నారు. మంచి కంటెంట్‌తో చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని మెచ్చుకున్నారు. ఈ ప్రీమియర్‌లో చిత్ర నిర్మాత పునీత్‌ సతీమణి అశ్వినీ, నటులు రక్షిత్‌ శెట్టి, రిషబ్‌ శెట్టి సైతం పాల్గొన్నారు. మరోవైపు ఈ సినిమా విడుదలతో కర్ణాటకలోని పలు థియేటర్ల వద్ద అప్పు అభిమానులు సందడి చేస్తున్నారు.







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు