RRR: రామ్‌చరణ్‌ కో-స్టార్‌కు ఉపాసన థ్యాంక్స్‌

రామ్‌చరణ్‌ (Ram Charan) కో-స్టార్‌కు ఆయన సతీమణి ఉపాసన (Upasana) కృతజ్ఞతలు చెప్పారు. ‘ఆస్కార్‌’ (Oscars) ప్రమోషన్స్‌ కోసం అమెరికాలో ఉన్న ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు.

Updated : 12 Mar 2023 18:52 IST

హైదరాబాద్‌: అకాడమీ (Oscars) అవార్డుల ప్రదానోత్సవానికి సమయం సమీపిస్తోంది. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌ వేదికగా జరగనున్న వేడుకలో ఈ సారి మన దేశం తరఫు నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) టీమ్‌ సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమెరికాలో ఉన్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ప్రత్యేకంగా విందు ఇచ్చారు. సౌత్‌ ఏషియన్‌ ఎక్స్‌లెన్స్‌ పేరుతో జరిగిన ఈ వేడుకల్లో  ఉపాసన పాల్గొన్నారు. తన భర్త రామ్‌చరణ్‌, ప్రియాంకలతో ఫొటోలు దిగిన ఆమె ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘లాస్‌ ఏంజెల్స్‌ ఫ్యామిలీ.. ఎల్లప్పుడూ మాకోసం ఉన్నందుకు థ్యాంక్యూ ప్రియాంక’’ అని పేర్కొన్నారు.

ఇక, ఈ పార్టీలో ఎన్టీఆర్‌ (NTR) స్టైలిష్‌ లుక్‌లో మెరిసిపోయారు. ఆయనతో ఫొటోలు దిగేందుకు ప్రీతిజింటా, జాక్వెలిన్‌ తదితరులు ఆసక్తి కనబరిచారు. ప్రస్తుతం ఆయా ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, ‘నాటు నాటు’ సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సైతం ఈ పార్టీలో పాల్గొని ప్రియాంకతో ఫొటోలు దిగాడు. ‘మగధీర’ తర్వాత రామ్‌చరణ్‌ - ప్రియాంక చోప్రా కలిసి ‘తుపాన్’ అనే సినిమా కోసం కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా నుంచే వీరిద్దరూ మంచి స్నేహితులు అయ్యారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు