Odisha Train Tragedy: ఒడిశా రైలు ప్రమాదం.. హృదయం ముక్కలైంది: సినీతారల ట్వీట్స్‌

Odisha Train Tragedy.. ఒడిశా రైలు ప్రమాదం అందర్నీ కలచివేసింది. దీనిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Updated : 03 Jun 2023 13:42 IST

హైదరాబాద్‌: శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో ఒడిశా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 278 మంది మృతి చెందగా 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ మహా విషాదంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

‘‘రైలు ప్రమాద దుర్ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. మృతుల కుటుంబాల గురించే చింతిస్తున్నాను. ప్రస్తుతం క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటానికి రక్తం ఎంతో అవసరం. కాబట్టి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులందరూ దయచేసి రక్తదానానికి ముందుకు రావాలని కోరుతున్నాను’’ - చిరంజీవి

‘‘ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం గురించి విని నా హృదయం ముక్కలైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ - అల్లు అర్జున్‌

‘‘ఇలాంటి ఘోర ప్రమాదం చోటుచేసుకోవడం నిజంగానే బాధాకరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే క్షతగాత్రులు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ - సల్మాన్‌ ఖాన్‌

‘‘రైలు ప్రమాద ఘటన నా హృదయాన్ని కలచివేసింది. నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. క్షతగాత్రులు కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా. రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేయడానికి ముందుకు వచ్చిన స్థానికులకు ధన్యవాదాలు’’ - యశ్‌

‘‘రైలు ప్రమాద ఘటనతో నా హృదయం ముక్కలైంది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ - రష్మిక

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని