Oscars 2023: ఆయన ధైర్యమే ఆస్కార్ కల నెరవేరేలా చేసింది.. ప్రముఖుల ప్రశంసలు
ఆస్కార్ (Oscars 2023) వేదికపై ఆర్‌ఆర్‌ఆర్ ‘నాటు నాటు’ (Naatu Naatu) సాంగ్‌కి అవార్డు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఆనందం వ్యక్తం చేశారు. చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
హైదరాబాద్: ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’ (Oscars 2023) అవార్డు ఈ ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR)లోని ‘నాటు నాటు’ (Naatu Naatu) (బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరి) పాటకు రావడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నాటి కల నేడు సాకారమైందన్నారు. ఈ మేరకు ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌ను ప్రశంసిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.
‘‘విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెలుచుకోవడం తెలుగువారికి గర్వకారణం. ‘నాటు నాటు’ పాట తెలంగాణ సంస్కృతి.. తెలుగు ప్రజల అభిరుచికి నిదర్శం. తెలుగు మట్టి వాసనలను వెలుగులోకి తీసుకువచ్చిన చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి, చిత్ర దర్శకుడు రాజమౌళి, నటీనటులందరికీ అభినందనలు’’ - కేసీఆర్
‘‘భారతీయ జెండా రెపరెపలాడుతోంది!! తెలుగు పాట అవార్డు అందుకోవడం పట్ల ఎంతో గర్విస్తున్నా. అంతర్జాతీయ వేదికపై మన జానపదం ఇంతటి గుర్తింపు సొంతం చేసుకోవడం సంతోషంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు నా అభినందనలు’’ - జగన్
‘‘అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా అవార్డును దక్కించుకుని ‘నాటు నాటు’ ఖ్యాతి గడించింది. భారతీయ చిత్రానికి గర్వించే క్షణాలు ఇవి. రాజమౌళి, కీరవాణి, ఎన్టీఆర్, రామ్‌చరణ్, కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్‌లకు కంగ్రాట్స్’’ - చంద్రబాబు నాయుడు
‘‘నాటు నాటు’ ప్రపంచ ఖ్యాతి సొంతం చేసుకుంది!! ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డును దక్కించుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ సభ్యులందరికీ నా హృదయ పూర్వక అభినందనలు. ‘ఆస్కార్’ అనేది ఇప్పటివరకూ భారత్‌కు ఒక కలగా ఉండేది. కానీ, రాజమౌళి విజన్, ధైర్యం, నమ్మకం మనకు అవార్డు వచ్చేలా చేసింది. కోట్లాది భారతీయుల హృదయాలు గర్వం, సంతోషంతో నిండిన క్షణాలివి’’ - చిరంజీవి
‘‘భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర సంగీత దర్శకులు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్‌కు హృదయపూర్వక అభినందనలు. ఈ వార్త విని ఎంతో సంతోషించాను. ఆస్కార్ ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’గా నిలిచిన ‘నాటు నాటు’ ప్రపంచం నలువైపులా ప్రతి ఒక్కరితో డ్యాన్స్ చేయించింది. ప్రతిష్ఠాత్మక స్టేజ్‌పై పాటను ఆలపించడం.. అవార్డును అందుకోవడంతో భారతీయ సినిమా ఖ్యాతి మరోస్థాయికి చేరింది. ఇంతటి ఘనత సొంతమయ్యేలా చేసిన దర్శకుడు రాజమౌళి, నటులు రామ్‌చరణ్, ఎన్టీఆర్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, నిర్మాత డీవీవీ దానయ్య ఇతర బృందానికి నా అభినందనలు’’ - పవన్‌కల్యాణ్
‘‘వావ్!! భారతదేశం గర్వించే చరిత్రాత్మక క్షణాలివి. అందరి నమ్మకాలను నిజం చేస్తూ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది. ఇంతటి గొప్ప పురస్కారాన్ని అందుకున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ మొత్తానికి నా అభినందనలు’’ - లోకేశ్
‘‘చరిత్ర సృష్టించాం. భారతీయలందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు’’ - రవితేజ
ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుని గెలుపొందిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్‌ను సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితోపాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రబృందానికి శుభాకాంక్షలు. అలాగే బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్‌గా ఆస్కార్‌ను అందుకున్న ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’టీమ్‌కు నా అభినందనలు’’ - బాలకృష్ణ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!
-
General News
Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కలకలం
-
Movies News
keerthy suresh: ‘దసరా’ కోసం ఐదురోజులు డబ్బింగ్ చెప్పా: కీర్తిసురేశ్
-
Crime News
ఘోరం: హోంవర్క్ చేయలేదని చితకబాదిన టీచర్.. ఏడేళ్ల బాలుడి మృతి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
World Boxing Championship: ప్రపంచ మహిళ బాక్సింగ్ ఛాంపియన్షిప్.. భారత్‌కు మరో స్వర్ణం