Indira Devi: ఇందిరాదేవి మరణవార్త.. కలచివేసింది: చిరంజీవి

మహేశ్‌బాబు (Mahesh Babu) తల్లి ఇందిరా దేవి (Indira Devi) మరణ వార్త తననెంతగానో కలచివేసిందని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు.....

Updated : 28 Sep 2022 12:39 IST

హైదరాబాద్‌: మహేశ్‌బాబు (Mahesh Babu) తల్లి ఇందిరాదేవి (Indira Devi) మరణవార్త తననెంతగానో కలచివేసిందని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ‘‘ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి, సోదరుడు మహేశ్‌బాబుకు, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అని చిరు ట్విటర్‌లో పేర్కొన్నారు. చిరంజీవితోపాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

‘‘ఘట్టమనేని కృష్ణగారి సతీమణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం బాధాకరం. ఆమె మృతి సూపర్‌స్టార్‌  కుటుంబానికి తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - నందమూరి బాలకృష్ణ

‘‘ఇందిరమ్మ మరణ వార్త నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కృష్ణ గారు, మహేశ్‌బాబు, ఇతర కుటుంబసభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - బాబీ

‘‘మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి గారు తుదిశ్వాస విడిచారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ కుటుంబ సభ్యులందరికీ దేవుడు వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను’’ - మార్గాని భరత్‌

‘‘ప్రముఖ నటులు, సూపర్‌స్టార్‌ కృష్ణగారి సతీమణి ఇందిరాదేవి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - నారా లోకేశ్‌

‘‘సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు మాతృమూర్తి ఇందిరాదేవి మరణం బాధాకరం. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఇందిరాదేవి ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించానలి భగవంతుడిని ప్రార్థిస్తున్నా’’ - బండి సంజయ్‌








Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని