‘భారతీయుల కల నెరవేరిన రోజు..’

అయోధ్య నగరంలో రామ మందిరాన్ని నిర్మించేందుకు నేడు అంకురార్పణ జరిగింది. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ

Updated : 08 Nov 2023 14:09 IST

రామ మందిరం నిర్మాణంపై సినీ ప్రముఖుల స్పందన

అయోధ్య: అయోధ్య నగరంలో రామ మందిరాన్ని నిర్మించేందుకు నేడు అంకురార్పణ జరిగింది. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మధ్యాహ్నం ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో కొద్దిమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భారతీయులు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.  

‘‘భారతీయులందరి బంగారు కల నెరవేరుతున్న రోజు. ‘శ్రీరామదాసు’ దర్శకుడిగా నా జన్మధన్యం. జై శ్రీరామ్‌. రామరాజ్యం వచ్చేస్తుంది’’: దర్శకుడు కె. రాఘవేంద్రరావు

‘‘అయోధ్య రాముడు ఆనందించేలా.. భారతదేశం గర్వించేలా.. ప్రపంచ చరిత్ర చెప్పుకునేలా.. ఎదురులేని, తిరుగులేని, మొక్కవోని సాహసంతో పుణ్యకారం తలపెట్టిన పుణ్యాత్ములందరికీ శతథా సహస్రథా వందనం.. అభివందనం. జై శ్రీరామ్‌..’’ సినీనటుడు మోహన్‌ బాబు

‘‘ఈ రోజు చాలా సుదినం. ఎన్నాళ్లో వేచిన ఉదయం. ఆనందిస్తోంది ప్రతి ఒక్కరి హృదయం. పవిత్ర సరయూ నది తీరాన ప్రభవించిన అయోధ్య పుణ్యక్షేత్రాన నేడు రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతోంది. నలుదిశలా వినిపించాలి రామనామ సంకీర్తన. పరిమళించాలి మానవత్వం పారిజాతమై ప్రపంచాన. శ్రీరాముడు అందరివాడు. మానవీయతను మనసారా ప్రేమించినవాడు. మనిషిని మనిషిగా ప్రేమించడమే హైందవ జీవన సిద్ధాంతం అని నమ్మినవాడు. అటువంటి ఆదర్శ , అజేయ, ఆత్మీయ, మన అయోధ్య రాముడికి నమోం నమః. జై శ్రీరామ్‌.’’: నటుడు, సాయి కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని