Fathers Day: నాన్న.. గోరుముద్ద

ఓ తండ్రిగా తన గారాలపట్టి క్లీంకారతో గడిపే ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా అన్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఆయన ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా తన ముద్దుల తనయతో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.. నాన్నగా తన ప్రయాణంలోని మధురానుభూతుల్ని గుర్తు తెచ్చుకున్నారు.

Published : 17 Jun 2024 01:40 IST

తండ్రిగా తన గారాలపట్టి క్లీంకారతో గడిపే ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా అన్నారు కథానాయకుడు రామ్‌చరణ్‌. ఆయన ఆదివారం ఫాదర్స్‌ డే సందర్భంగా తన ముద్దుల తనయతో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ.. నాన్నగా తన ప్రయాణంలోని మధురానుభూతుల్ని గుర్తు తెచ్చుకున్నారు. క్లీంకారకు గోరు ముద్దలు తినిపించడం తనకెంతో ఇష్టమని.. రోజులో రెండుసార్లైనా స్వయంగా తినిపిస్తానని.. తాను తినిపిస్తే గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందేనని.. ఆ విషయంలో తనని ఎవరూ ఓడించలేరని కూతురుపై ప్రేమను వ్యక్తపరిచారు. క్లీంకార ఇప్పుడిప్పుడే కుటుంబ సభ్యుల్ని గుర్తిస్తోందని.. చిత్రీకరణలకు వెళ్లినప్పుడు తనని ఎంతో మిస్‌ అవుతున్నట్లు చెప్పారు. ఇకపై తన బిడ్డతో ఎక్కువ సమయం వెచ్చించేలా తదుపరి చిత్రాల షెడ్యూల్స్‌ ప్లాన్‌ చేసుకోనున్నట్లు తెలిపారు. క్లీంకారతో ఉన్నప్పుడు తన తండ్రి చిరంజీవి ఆమెకు పెద్దన్నలా మారిపోతారని.. ఆమెతో తాత అని పిలిపించుకోవడం బోర్‌గా ఫీలవుతారని.. ‘చిరుత’ అని పిలవమంటూ మురిసిపోతారని చెప్పారు. ఇక కెరీర్‌ విషయంలో భవిష్యత్తులో తన బిడ్డ తల్లి బాటలో నడిస్తే బాగుంటుందని ఆకాంక్షించారు. ఎందుకంటే ఇప్పటికే తమ కుటుంబంలో చాలామంది నటులున్నారని.. సినిమాల విడుదలల విషయంలో తాము పోరాడుతున్నామని.. ఇప్పుడీ రంగంలో తన కూతురితో గొడవ పడటం తనకిష్టం లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ ముగింపు దశలో ఉండగా.. బుచ్చిబాబు దర్శకత్వంలో చేయాల్సిన సినిమా చిత్రీకరణకు సిద్ధమవుతోంది.


అనుబంధం.. మమకారం 

అమ్మ తనువులో భాగమిస్తే.. పిల్లలకోసం తన జీవితాన్నే అంకితం చేసేవాడు నాన్న. చిటికెన వేలు పట్టుకొని నడిపిస్తూ తమ కలల పంట భవిష్యత్తును తీర్చిదిద్దేవాడు నాన్న. అందుకే మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరికీ నాన్నంటే ఎనలేని మమకారం. లక్షలు, కోట్లమందికి ఆరాధ్యులైనా.. సినీ తారలూ ఆ అనుబంధానికి బందీలే. ‘ఫాదర్స్‌ డే’ సందర్భంగా నాన్నతో తమకు ఉన్న  అనుబంధాన్ని వాళ్లు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. తమని నాన్నలా మార్చి, జీవితంలో మరో మెట్టు ఎక్కించిన తమ వారసులతో ఉన్న అనుబంధాన్ని చిత్రాల్లో అభివర్ణిస్తూ మురిసిపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని