సోషల్‌ లుక్‌: నమ్మలేకపోతున్న చెర్రీ.. అదా స్టంట్స్‌

తన తొలి సినిమా ‘చిరుత’ విడుదలై, 13 ఏళ్లైందంటే నమ్మలేకపోతున్నానని రామ్‌చరణ్‌ తెలిపారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయన్నారు. తనను ప్రేమించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు....

Updated : 08 Dec 2022 15:23 IST

* తన తొలి సినిమా ‘చిరుత’ విడుదలై, 13 ఏళ్లు పూర్తయిందంటే నమ్మలేకపోతున్నానని రామ్‌చరణ్‌ తెలిపారు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎత్తుపల్లాలు ఉన్నాయన్నారు. తనను ప్రేమించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

* వరలక్ష్మి శరత్‌ కుమార్‌ వీధి కుక్కలకు జబ్బు చేయకుండా టీకాలు వేస్తున్నారు. ఈ మేరకు ‘సేవ్‌శక్తి’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆమే కుక్కలకు టీకాలు వేస్తున్నారు.

* అలియా భట్‌ తన స్నేహితుడు రణ్‌బీర్‌ కపూర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ.. ఫొటో షేర్‌ చేశారు. వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

* సమంత తన దుస్తుల బ్రాండ్‌ ‘సాకి’ని అధికారికంగా సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున తన కోడలికి శుభాకాంక్షలు తెలిపారు.

* అదా శర్మ ఓ మ్యాగజైన్‌ కోసం ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో తీసిన వీడియోను షేర్‌ చేశారు... ఇలా మన తారలు ఫాలోవర్స్‌తో పంచుకున్న ఆసక్తికర విషయాలు మీ కోసం..











Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని