సోషల్‌లుక్‌: త్రిష్‌ లైఫ్‌ ఛేంజ్‌: కల్యాణి స్కైడ్రైవ్‌

సెప్టెంబరు 30 1999.. తన జీవితాన్ని మార్చేసిందని నటి త్రిష గుర్తు చేసుకున్నారు. ‘మిస్‌ చెన్నై’ అందాల కిరీటం అందుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు. దీనికి మంచు లక్ష్మి స్పందిస్తూ.. త్రిష అందంలో ఎటువంటి మార్పు రాలేదని, అలానే చక్కగా ఉన్నారని కితాబిచ్చారు. ....

Published : 01 Oct 2020 01:12 IST

* సెప్టెంబరు 30 1999.. తన జీవితాన్ని మార్చేసిందని నటి త్రిష గుర్తు చేసుకున్నారు. ‘మిస్‌ చెన్నై’ అందాల కిరీటం అందుకున్న రోజుల్ని గుర్తు చేసుకున్నారు. దీనికి మంచు లక్ష్మి స్పందిస్తూ.. త్రిష అందంలో ఎటువంటి మార్పు రాలేదని, అలానే చక్కగా ఉన్నారని కితాబిచ్చారు.

* ఉపాసన, సమంత కలిసి ‘యువర్ లైఫ్’ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్‌సైట్‌కు సమంత అతిథి సంపాదకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోషకాహారంపై సామ్‌ రాసిన కథనం చదివిన ఉపాసన స్ఫూర్తి పొందారట. గిల్టీగా ఫీల్‌ అయ్యానని ట్వీట్‌ చేశారు.

* తన తండ్రి మహేశ్‌బాబు ది బెస్ట్‌ అంటూ సితార ఫొటోను షేర్‌ చేసింది. అందులో చిన్నారి సూపర్‌స్టార్‌ను గట్టిగా హత్తుకుని కనిపించింది.

* నటి కల్యాణి ప్రియదర్శన్‌‌ స్కై డ్రైవ్‌ చేసిన ఫొటోల్ని పంచుకున్నారు. ఫొటోలో నవ్వుతున్నట్లు కనిపించినా.. లోపల మాత్రం ఏడుస్తున్నానని అన్నారు.

* సోషల్‌మీడియాలో అరుదుగా మాట్లాడే సాయిపల్లవి గార్డెన్‌లో తీసుకున్న ఫొటోల్ని షేర్‌ చేశారు. ఇలా తాజాగా మన సినీ తారలు నెటిజన్లతో పంచుకున్న విశేషాలు చూడండి..















Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని