కాజల్‌ సోదరి భావోద్వేగం: తిరుమలలో మంచులక్ష్మి

ఓ పక్క తన సోదరి కాజల్‌ పెళ్లి సందడి జరుగుతుంటే.. మరోపక్క నిషా అగర్వాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. మెహెందీ వేడుక సమయంలో ఆమె కంటతడి పెట్టుకున్న సందర్భంలో తీసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను కాజల్‌ షేర్‌ చేశారు....

Published : 31 Oct 2020 00:52 IST

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు..

* కాజల్‌ పెళ్లి వేడుకలో ఆమె సోదరి నిషా అగర్వాల్‌ భావోద్వేగానికి గురయ్యారు. మెహందీ వేడుక సమయంలో ఆమె కంటతడి పెట్టుకున్న సందర్భంలో తీసిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను కాజల్‌ షేర్‌ చేశారు.

* అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘క్వశ్చన్‌ మార్క్‌’. శ్రీ కృష్ణ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాకు విప్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని శుక్రవారం విడుదల చేశారు.  ‘రామసక్కనోడివిరా పిలగో..’ అంటూ సాగే ఈ పాటకు సంగీత దర్శకుడు రఘు కుంచె సారథ్యంలో బండి సత్యం సాహిత్యాన్ని సమకూర్చగా.. మంగ్లీ ఆలపించారు.

* తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని టాలీవుడ్‌ నటులు మంచు లక్ష్మి, మంచు విష్ణు దర్శించుకున్నారు. దేవుడ్ని నమ్మి ముందడుగు వేస్తే ఎంతటి కష్టతరమైన సమస్యనైనా ఎదుర్కోవచ్చని ఈ సందర్భంగా మంచు లక్ష్మి పోస్ట్‌ చేశారు. తిరుమల ఆలయ ప్రాంగణంలో తీసుకున్న ఫొటోలు షేర్‌ చేశారు.

* కథానాయిక శ్రుతి హాసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 15 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా తన అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ ఆమె ప్రత్యేక పోస్ట్‌ చేశారు.

* బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ తన తల్లి దగ్గర హెడ్‌ మసాజ్‌ చేయించుకున్నారు. త్వరలో రెండో శిశువుకు జన్మనివ్వబోతున్న ఆమె ఇంట్లోనే సమయం గడుపుతున్నారు. ‘అమ్మ చేతి మసాజ్‌’ అంటూ శుక్రవారం ఫొటో షేర్‌ చేశారు.















Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని