గణతంత్ర స్ఫూర్తితో వేడుకలు చేసుకుందాం

భారత 72వ గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. జైహింద్ అంటూ నినదించారు. తారక్‌, రానా, అడివిశేష్‌,అమితాబ్‌, చిరు, వరుణ్‌తేజ్‌, సాయితేజ్‌ ఇలా చాలామంది

Updated : 23 Jan 2024 16:49 IST

సెలబ్రిటీ ట్వీట్స్‌

హైదరాబాద్‌: భారత 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. జైహింద్ అంటూ నినదించారు. అమితాబ్‌, చిరంజీవి, తారక్‌, రానా, అడివిశేష్‌, వరుణ్ ‌తేజ్‌, సాయి తేజ్‌ తదితరులు దేశ ఘనతను వివరిస్తూ ట్విటర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

గణతంత్ర దినోత్సవం అంటేనే ఆనందం, శాంతి, సమైక్యత- అమితాబ్‌ బచ్చన్‌

దేశప్రజలకు, మెగా అభిమానులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రిపబ్లిక్‌డేను పురస్కరించుకుని విస్తృతంగా రక్తదానం చేయ సంకల్పించిన మెగా బ్లడ్‌ బ్రదర్స్‌ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నా పిలుపు మేరకు చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌కు వచ్చి రక్తదానం చేస్తోన్న, చేసిన రక్తదాతలకు హృదయపూర్వక అభినందనలు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి.. జైహింద్‌- మెగాస్టార్‌ చిరంజీవి

భారతదేశ రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశాన్ని మరింత అత్యున్నత స్థాయికి తీసుకెళ్తామని మనమంతా ప్రతిజ్ఞ చేద్దాం- మహేశ్‌బాబు

అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. గణతంత్ర స్ఫూర్తితో అందరం వేడుకలు చేసుకుందాం- తారక్‌

గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లతో కలిసి ఉండటం గౌరవంగా భావిస్తున్నాను. గ్యాలంట్రీ పతకాలు సాధించిన జవాన్ల వీరగాథలు వింటుంటే ఎంతో అబ్బురంగా ఉంది- అడవి శేష్‌

దేశ సమైక్యత, శ్రేయస్సు, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుందాం. గణతంత్ర దినోత్సవం రోజున వారి కోసం ప్రార్థనలు చేద్దాం- వరుణ్‌తేజ్‌

అందరం కలిస్తే సాధించలేనిది ఏమి లేదంటూ చరిత్ర నిరూపించింది. అదే స్ఫూర్తితో ఐకమత్యంతో మరింత అభివృద్ధి సాధిద్దాం. భావితరాలకు భరోసానిద్దాం- సాయితేజ్‌

నన్ను సాదరంగా ఆహ్వానించిన బీఎస్‌ఎఫ్‌ దళానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా సెల్యూట్‌ చేస్తున్నాను- రానా

 

ఇవీ చదవండి!

రవితేజ ‘ఖిలాడి’ఎంట్రీ అదుర్స్‌!

మోనాల్‌ సవాల్‌.. కరీనా నీ ఓపికకు సలాం









Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని