Upasana: ప్రేమలో ఉండటం అంత సులభం కాదు: ఉపాసన

‘‘ప్రేమలో పడటం సులభమే కానీ దానిలో ఉండటం పార్క్‌లో సరదాగా నడిస్తూ కాలక్షేపం చేసినంత ఈజీ కాదు’’ అని అంటున్నారు నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన. వాలంటైన్స్‌ డేని పురస్కరించుకుని నెటిజన్లకు...

Published : 14 Feb 2022 15:10 IST

తమ అన్యోన్యతకు గల రహస్యాన్ని చెప్పిన చెర్రీ సతీమణి

హైదరాబాద్‌: ‘‘ప్రేమలో పడటం సులభమే కానీ దానిలో ఉండటం పార్క్‌లో సరదాగా నడిస్తూ కాలక్షేపం చేసినంత ఈజీ కాదు’’ అని అంటున్నారు నటుడు రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన. వాలంటైన్స్‌ డేని సందర్భంగా నెటిజన్లకు ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు. చరణ్‌తో తన వివాహమై 10 సంవత్సరాలైందని.. తమ మధ్య అన్యోన్యతకు గల రహస్యాన్ని ఆమె తెలియజేశారు. జీవితభాగస్వామి లేదా ప్రియమైన వారితో మన బంధం ఎప్పుడూ సంతోషంగా సాగాలంటే ఏం చేయాలో చెప్పారు.

‘‘నేను చరణ్‌ పెళ్లి చేసుకుని పదేళ్లు అయ్యింది. వాలంటైన్స్‌ డే నాకు ఎప్పుడూ ప్రత్యేకమే. ప్రియమైన వారితో మీ బంధం మరింత బలంగా మారేందుకు ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి.
వివాహ బంధంలో ఆరోగ్యానికి ముఖ్యస్థానం ఉంది. కాబట్టి మనం ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధపెట్టాలి. ప్రతిరోజూ ఉదయాన్నే నిద్రలేవాలి.
ప్రియమైన వారితో కొద్ది సమయాన్ని గడపటం రొటీన్‌గా మార్చుకోవాలి. ఏ కాస్త ఖాళీ దొరికినా డిన్నర్‌ డేట్‌, సినిమాలు చూడటం, కబుర్లు చెప్పుకోవడం.. ఇలా చేయడం వల్ల మీ జీవితం మరింత అందంగా మారుతుంది. ఒకవేళ మీరు కనుక ఇది ఫాలో కాకపోతే ఇప్పటికైనా దయచేసి మీ వారి కోసం సమయాన్ని కేటాయించడం తెలుసుకోండి.
ప్రతిఒక్కరూ పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారంటారు. కానీ, అది నిజం కాదు. భూమ్మీద ఇద్దరు వ్యక్తులు ఎంతో శ్రమిస్తేనే వివాహానికి పునాది పడుతుంది. వీటితోపాటు ఎదుటివ్యక్తిపై అమితమైన ప్రేమ, గౌరవం చూపించాలి’’ అని ఉపాసన చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని