NTR: తారక్‌.. నిన్ను చూసి ఆ క్షణం కన్నీళ్లు ఆగలేదు..!

ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌.. ఇప్పుడు ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌ చూసినా ఈ పేరే ట్రెండింగ్‌లో ఉంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుంచే అభిమానులు....

Updated : 20 May 2022 10:55 IST

సోషల్‌మీడియాలో మార్మోగుతున్న తారకమంత్రం

హైదరాబాద్‌: ఎన్టీఆర్.. ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌.. ఇప్పుడు ఏ సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్‌ చూసినా ఈ పేరే ట్రెండింగ్‌లో ఉంది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని శుక్రవారం తెల్లవారుజాము నుంచే అభిమానులు, సినీ తారలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని తెలియజేస్తూ అపురూప చిత్రాలను షేర్‌ చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో ఇటీవల సూపర్‌సక్సెస్‌ని అందుకున్న ఆయన రానున్న రోజుల్లో మరెన్నో అద్భుత చిత్రాల్లో నటించాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

‘‘సోదరుడు, సహ నటుడు, స్నేహితుడు‌.. తారక్‌.. నువ్వు నాకేమవుతావో చెప్పడానికి పదాలు కూడా సరిపోవని నేను అనుకుంటున్నా. మన మధ్య ఉన్న అనుబంధాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. హ్యాపీ బర్త్‌డే!!’’ - రామ్‌ చరణ్‌ 

‘‘హ్యాపీ బర్త్‌డే మై డియర్‌ బాద్‌షా..! ‘నిన్ను చూడాలని’ మొదటి రోజు షూటింగ్ నుంచి ‘యంగ్‌ టైగర్‌’ ఇప్పుడు ‘ పాన్‌ ఇండియా టైగర్‌’ వరకూ మీ అద్భుతమైన ఎదుగుదలకు నేను ప్రత్యక్ష సాక్షిని.  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో మీ నటన అత్యద్భుతం. ముఖ్యంగా కొమురంభీముడో పాటలో మీ నటనతో నాకు కన్నీళ్లు వచ్చేలా చేశారు. మీరు మరెన్నో ఎత్తులకు ఎదగాలని మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’ - శ్రీనువైట్ల

‘‘తారక్‌ అన్నా.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ ఏడాదంతా మీకు ప్రేమ, విజయం, సంతోషాలతో నిండాలని కోరుకుంటున్నా’’ - సాయిధరమ్‌ తేజ్‌

‘‘హ్యాపీ బర్త్‌డే తారక్‌. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సమయంలో నిన్ను కలిసి నీతో మాట్లాడటం ఎంతో ఆనందంగా అనిపించింది. మీరు ఇలాగే అందరి మనసుల్ని గెలుచుకుంటూ ఎన్నో విజయాలు, ఆనందాలను సొంతం చేసుకోవాలని ప్రార్థిస్తున్నా’’ - అజయ్‌ దేవ్‌గణ్‌

‘‘చిన్న రామయ్యకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్య నట ప్రస్థాన అభివృద్ధి రస్తు’’ - పరుచూరి గోపాలకృష్ణ











Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని