NTR: బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌.. బీటౌన్‌ స్టార్‌హీరో ట్వీట్‌ వైరల్‌

ఎన్టీఆర్‌ (NTR) పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం సినీ సెలబ్రిటీలు ఆయనకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.

Updated : 20 May 2023 18:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హీరోగా ‘వార్‌ 2’ (WAR 2) పేరుతో బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్‌ (NTR) నటించనున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇప్పుడా వార్తలకు మరింత బలం అందించేలా హృతిక్‌రోషన్‌ శనివారం ఓ ట్వీట్‌ పెట్టారు. తారక్‌కు పుట్టినరోజున శుభాకాంక్షలు చెబుతూ తన కోసం యుద్ధభూమిలో ఎదురుచూస్తుంటానని పేర్కొన్నారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు మిత్రమా!! ఈరోజు సంతోషంగా గడవాలని, ఈ ఏడాదంతా యాక్షన్‌ ప్యాక్డ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. మై ఫ్రెండ్‌ నీకోసం యుద్ధభూమిలో ఎదురుచూస్తున్నా. నన్ను కలిసే వరకూ నీ రోజులన్నీ సంతోషం, ప్రశాంతంతో నిండాలని కోరుకుంటున్నా’’  అని హృతిక్‌ రాసుకొచ్చారు.

‘‘మీ లవ్లీ విషెస్‌కు ధన్యవాదాలు సార్‌..! మీరు కూడా రోజులు లెక్కబెట్టుకోండి. జరగనున్న దాని గురించి ఆలోచిస్తూ చక్కగా నిద్రపోతున్నారని అనుకుంటున్నా. ఎందుకంటే, మంచి విశ్రాంతితో యుద్ధభూమిలో మిమ్మల్ని చూడాలనుకుంటున్నా. త్వరలో కలుద్దాం’’ అని తారక్‌ రిప్లై ఇచ్చారు.

కాగా, ఈ ట్వీట్స్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిని చూసిన నెటిజన్లు ‘వార్‌ 2’లో ఎన్టీఆర్‌ భాగం అవుతోన్న విషయం నిజమేనని అనుకుంటున్నారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. మరోవైపు పలువురు సినీ సెలబ్రిటీలు, నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

‘‘అద్భుతమైన ప్రతిభ కలిగిన ఎన్టీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడు నీకు ఆయురారోగ్యాలు, సంతోషం అందించాలని ప్రార్థిస్తున్నాను’’ - చిరంజీవి

‘‘నా ప్రియమైన సోదరుడు తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘దేవర’లో నీ క్రోధమైన లుక్‌ చూసి ఆశ్చర్యపోయాను. ఆనందం, ప్రేమ, చిరునవ్వులతో ఈ రోజు నిండాలని కోరుకుంటున్నాను. ఈ ఏడాది నీకు అద్భుతంగా సాగాలని ఆశిస్తున్నా’’ - మనోజ్‌ మంచు

‘‘నేను ఎంతగానో అభిమానించే ఎన్టీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడు నీకు ఉండాలని కోరుకుంటున్నాను. విజయం, సంతోషంతో ఈ ఏడాది అత్యద్భుతంగా కొనసాగాలని ప్రార్థిస్తున్నాను’’ - ఖుష్బూ

‘‘2003లో నేను ‘సింహాద్రి’ చూడలేకపోయాను. కానీ, (సింహాద్రి రీ రిలీజ్‌ను ఉద్దేశిస్తూ..) ఈ అనుభవం దానికి తగ్గట్టుగా ఉంది. ప్రతి పది నిమిషాలకు థియేటర్‌లో సందడి ఉంది. అభిమానులందరి నుండి అద్భుతమైన పుట్టినరోజు బహుమతి ఇది’’ - కార్తికేయ



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు