HBD Modi: ప్రధాని మోదీకి సినీ ప్రముఖుల శుభాకాంక్షలు

భారత ప్రధాని నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ(Narendra Damodardas Modi) పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.72వ పుట్టినరోజు...

Published : 17 Sep 2022 15:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Damodardas Modi) పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.72వ పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో క్షేమంగా, సంతోషంగా ఉండాలంటూ తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రముఖులు షారుఖ్ ఖాన్‌, అక్షయ్‌ కుమార్‌, అజయ్‌ దేవగణ్‌, అనిల్‌ కపూర్‌, అనుపమ్‌ ఖేర్‌, కరణ్‌ జోహార్‌, కంగనా రనౌత్, వివేక్‌ అగ్నిహోత్రి... తెలుగు, మలయాళ సినీ ప్రముఖులు చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్‌, మోహన్‌ బాబు, మహేశ్‌ బాబు, మా అధ్యక్షుడు విష్ణు మంచు తదితరులు తమ సోషల్‌ మీడియా ఖాతాల ద్వారా పీఎం మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని