HBD Ram Charan: స్పెషల్‌ ఫొటో షేర్‌ చేసిన చిరంజీవి.. గ్లోబల్‌స్టార్‌కు వెల్లువలా బర్త్‌డే విషెస్‌

రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సెలబ్రెటీలు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. స్పెషల్‌ ఫొటోలను షేర్‌ చేస్తున్నారు.

Updated : 27 Mar 2023 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి సినిమా ‘చిరుత’తో సినీరంగ ప్రవేశం చేసి ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగాడు మెగా హీరో రామ్‌ చరణ్‌(Ram charan). తన నటన, డ్యాన్స్‌తో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రతి సినిమాకు వైవిధ్యం చూపుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. ఫ్యాన్స్‌ అందరూ చెర్రీ అని పిలుచుకునే ఈ మెగా పవర్‌స్టార్‌ పుట్టినరోజు సందర్భంగా నేడు కొత్త సినిమా అప్‌డేట్‌లతో,  విషెస్‌తో సోషల్‌మీడియాలో సందడి నెలకొంది. సినీ ప్రముఖల నుంచి అభిమానుల వరకు అందరూ చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఒకవైపు శంకర్ దర్శకత్వంలో రామ్‌ చరణ్‌ నటిస్తోన్న సినిమా టైటిల్‌ ప్రకటించగా మరోవైపు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ చరణ్‌కు చిరంజీవి (Chiranjeevi) విషెస్‌ చెప్పారు. ఇక అభిమానులైతే వారం ముందు నుంచే కామన్‌ డీపీతో,  #HBDGlobalStarRamCharan అనే హ్యాష్‌ ట్యాగ్‌తో ట్రెండ్‌ సృష్టిస్తున్నారు.

• అంతర్జాతీయ స్థాయి ప్రశంసలు పొందేలా ఎదిగిన రామ్‌చరణ్‌కి ప్రేమ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు. స్నేహభావంతో మెలిగే అతడు మరెన్నో విజయాలు అందుకోవాలి. అందరి మన్ననలు పొందాలి. దైవ చింతన, ప్రశాంత చిత్తం, క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్ధత చరణ్‌కు ఆయుధాల్లాంటివి. భవిష్యత్తులోనూ మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను అందిస్తాడని ఆశిస్తున్నా’’ - పవన్‌కల్యాణ్‌

డియర్‌ రామ్‌ చరణ్‌ హ్యాపీ బర్త్‌ డే. ఎల్లప్పుడూ ఆనందంగా ఉండు. మరో అద్భుతమైన సంవత్సరం నీ కోసం ఎదరుచూస్తోంది - వెంకటేష్‌ 

నీది ఓ అసాధారణమైన ప్రయాణం. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు - సమంత 

పుట్టినరోజు శుభాకాంక్షలు చరణ్‌. ఒక నటుడిగా, వ్యక్తిగా నీ అసాధారణమైన అభివృద్ధి చూసి ఆశ్చర్యపోయాను. పనిపై నీకున్న అంకితభావంతో మిలియన్ల మంది హృదయాలను గెలుచుకున్నావు. నువ్వు ఎంతో మందికి స్ఫూర్తి.  ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను - సాయి ధరమ్‌ తేజ్‌ 

హ్యాపీ బర్త్‌డే రామ్‌ చరణ్‌. వినయం, కష్టపడి పనిచేసే స్వభావమే మిమ్మల్ని నేడు ఈ స్థాయికి చేర్చాయి.  మీరు అంచనాలకు మించి ఎదగడాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ  - దర్శకుడు బాబీ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని