Celebrity Cricket League: సీసీఎల్ మళ్లీ వస్తోంది.. ఆరోజే ప్రారంభం
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ఈసారి ఎన్ని జట్టులుంటాయి? కెప్టెన్లు ఎవరెవరంటే?
ఇంటర్నెట్ డెస్క్: సినీ హీరోలు కలిసి ఆడే సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్) (Celebrity Cricket League) సందడి మళ్లీ మొదలుకాబోతుంది. సుమారు మూడేళ్ల విరామం అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 18న ప్రారంభంకానుంది. ఈ మేరకు సీసీఎల్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఎనిమిది చలన చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు ఇందులో పాల్గొంటారని వెల్లడించింది. అంటే ఒక్కో ఇండస్ట్రీకి చెందిన నటులు ఒక్కో టీమ్‌గా ఉంటారు. తెలుగు వారియర్స్, ముంబయి హీరోస్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, కేరళ స్ట్రైకర్స్, బెంగాల్ టైగర్స్, భోజ్‌పురి దబాంగ్స్, పంజాబ్ దే షేర్స్‌గా టీమ్‌లు ఏర్పడనున్నాయి. తెలుగు టీమ్‌కు అక్కినేని అఖిల్, కన్నడ టీమ్‌కు కిచ్చా సుదీప్, తమిళ టీమ్‌కు ఆర్య, హిందీ టీమ్‌కు సోనూసూద్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. దాదాపు నెలపాటు సాగే ఈ పోటీలు జైపుర్, బెంగళూరు, త్రివేండ్రం, జోధ్‌పుర్, హైదరాబాద్‌లలో జరుగుతాయని సమాచారం. ఈ లీగ్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
ఐఏఎల్ (IPL) స్ఫూర్తితో 2011లో సీసీఎల్ తొలి మ్యాచ్ జరిగింది. అప్పుడు నాలుగు టీమ్‌లు మాత్రమే పాల్గొన్నాయి. 2019 వరకూ అటు క్రీడా, ఇటు సినీ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్న సీసీఎల్ కొవిడ్ కారణంగా మూడేళ్లు వాయిదా పడింది. ఆ లోటును భర్తీ చేసేలా ఈ ఏడాది మరింత జోష్ నింపనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Harish rao: కొత్త వైద్య కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: హరీశ్‌రావు
-
Politics News
Rahul Gandhi: ‘వాజ్‌పేయీ మాటలను గుర్తుతెచ్చుకోండి’.. అనర్హత వేటుపై ప్రశాంత్ కిశోర్!
-
General News
Tirumala: తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుత కలకలం
-
Movies News
keerthy suresh: ‘దసరా’ కోసం ఐదురోజులు డబ్బింగ్ చెప్పా: కీర్తిసురేశ్
-
Crime News
ఘోరం: హోంవర్క్ చేయలేదని చితకబాదిన టీచర్.. ఏడేళ్ల బాలుడి మృతి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు