Extra Jabardasth: 30 వెడ్స్‌ 21 జోక్స్‌ చూశారా?

30 సంవత్సరాల పృథ్వీ... 21 ఏళ్ల ‘చిన్నారి’ మేఘన... క్యూట్‌ కార్తిక్‌.. లవ్‌లీ జెస్సీ గుర్తున్నారా? అంత ఈజీగా మరచిపోయే పాత్రలా అవి... ‘30 వెడ్స్‌ 21’ వెబ్‌సిరీస్‌తో యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొట్టాయి మరి.

Updated : 27 Jul 2021 18:44 IST

30 సంవత్సరాల పృథ్వీ... 21 ఏళ్ల ‘చిన్నారి’ మేఘన...  క్యూట్‌ కార్తిక్‌.. లవ్‌లీ జెస్సీ గుర్తున్నారా?

- అంత ఈజీగా మరచిపోయే పాత్రలా అవి... ‘30 వెడ్స్‌ 21’ వెబ్‌సిరీస్‌తో రికార్డులు కొల్లగొట్టాయి మరి.

ఆ ‘30 వెడ్స్‌ 21’ మెయిన్‌ జంట అయిన మేఘన అలియాస్‌ అనన్య... పృథ్వీ అలియాస్‌ చైతన్య ఈసారి ఈటీవీలో సందడి చేశారు. ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’లో ‘30 వెడ్స్‌ 21’ పేరుతో ఓ స్పెషల్‌ స్కిట్‌ వేసి అంతకుమించి వినోదంతో వావ్‌ అనిపించారు. తన వయసును గుర్తు చేసే ఏ విషయాన్నీ తట్టుకోలేని పృథ్వీకి... ఓ వైపు యాంకర్‌ రష్మీ, మరోవైపు మేఘన పదేపదే వయసు గుర్తు చేస్తూ ఆటపట్టించారు. ఈ క్రమంలో ‘30’ బ్యాక్‌డ్రాప్‌లో జోకులు భలే పేలాయి.

ఈ క్రమంలో రష్మీని ఉద్దేశిస్తూ చైతన్య... తన తర్వాత వెబ్‌సిరీస్‌ను మీతోనే చేద్దామనుకుంటున్నానని.. దానికి ‘30 వెడ్స్‌ 30’ అని టైటిల్‌ పెడదామనుకుంటున్నానని చెప్పాడు. దీంతో స్టేజీ మీద నవ్వులు డబుల్‌ అయ్యాయి. మధ్యలో అనన్య అందుకొని మా ‘30 వెడ్స్‌ 21’ సీజన్‌ 2 పక్కన పెట్టు... ‘రష్మి వెడ్స్‌ సుధీర్‌’ సీజన్‌ 1 ఎప్పుడు అని అడగడంతో మరోసారి నవ్వులు. స్కిట్‌లో కార్తీక్‌ పాత్రలో ఇమ్మాన్యుయేల్‌ కనిపించాడు. తన మార్క్‌ పంచులతో స్కిట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఆఖర్లో బాబీ కూరగాయల బండితో వచ్చి... స్కిట్‌ను ఓ లెవల్‌కి లేపాడు. ఆ ‘30’ పంచ్‌లు ప్రవాహం పూర్తి వీడియో చూసేయండి మరి!

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని