Chandini Chowdary: మెసేజ్‌లు పంపించి వేధిస్తున్నారు.. జాగ్రత్త: చాందినీ చౌదరి

తన పేరు వాడుకుంటూ పలువురు వ్యక్తులు.. ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అడిగి తెలుసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని నటి చాందినీ చౌదరి తెలిపారు.

Published : 10 Dec 2022 14:51 IST

హైదరాబాద్‌: ‘కలర్‌ఫొటో’తో (Colour Photo) నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి చాందినీ చౌదరి (Chandini Chowdary). తాజాగా ఈ భామ నెటిజన్లను అప్రమత్తం చేస్తూ ఓ పోస్ట్‌ పెట్టారు. కొంతమంది వ్యక్తులు తన పేరు ఉపయోగించి వేధింపులకు పాల్పడుతున్నారని.. జాగ్రత్తగా ఉండాలని ఆమె తెలిపారు. ‘‘నాతోపాటు నా సహ నటీనటులకు సంబంధించిన పేర్లు, ఫొటోలతో గత కొన్నినెలల నుంచి అంతర్జాతీయ ఫోన్‌ నంబర్లు ఉపయోగించి కొంతమంది వ్యక్తులు స్కామ్‌కు పాల్పడుతున్నారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకోవడం కోసం వాట్సాప్‌లో మా పేర్లు వాడుకుంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. అనంతరం వేధింపులకు గురి చేస్తున్నారు. మీకు ఎవరికైనా ఇలాంటి మెసేజ్‌లు వస్తే దయచేసి రిపోర్ట్‌ చేయండి. అలాగే మీ వివరాలను వాళ్లతో పంచుకోకండి’’ అని చాందినీ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని