Chandrabose: తొలి పాట రాసిన చోటుకు ‘ఆస్కార్’ను తీసుకెళ్లి.. చంద్రబోస్ ఆనందం
‘ఆస్కార్’ ప్రదానోత్సవం అనంతరం తిరిగి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నారు గేయ రచయిత చంద్రబోస్. తనను టాలీవుడ్‌కు పరిచయం చేసిన రామానాయుడికి కృతజ్ఞుడినన్నారు.
హైదరాబాద్: సుమారు 28 ఏళ్ల క్రితం తాను ఎక్కడైతే (రామానాయుడు స్టూడియోస్) తొలి పాటను రాశారో అక్కడికి ‘ఆస్కార్’ (Oscars 2023)ను తీసుకెళ్లి ఆనందం వ్యక్తం చేశారు సినీ గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose). ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) కోసం ఆయన రాసిన ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకు ఆస్కార్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఆ వేడుకకు హాజరైన ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. రచయితగా తనను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన ప్రముఖ నిర్మాత దివంగత దగ్గుబాటి రామానాయుడిని గుర్తుచేసుకుంటూ ఆయన రామానాయుడు స్టూడియోస్‌కు వెళ్లారు. అక్కడ రామానాయుడు తనయుడు, నిర్మాత సురేశ్‌బాబుని కలిసి నాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. రామానాయుడు స్టూడియోస్‌లో మొదలైన నా ప్రయాణం ఆస్కార్ వరకూ వెళ్లిందంటూ సంతోషాన్ని పంచుకున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ తనకెంతో ప్రత్యేకమని తెలిపారు. రామానాయుడు ఆశీస్సులు తనపై ఉంటాయని అభిప్రాయపడ్డారు.
1995లో వచ్చిన ‘తాజ్‌మహల్’తో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు చంద్రబోస్. అందులో ఆయన రాసిన ‘మంచు కొండల్లోన చంద్రమా’ గీతం సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఆ పాట ప్రయాణం గురించి చెబుతూ చంద్రబోస్ 28 ఏళ్లు వెనక్కి వెళ్లారు. శ్రీకాంత్, సంఘవి, మోనికా బేడీ ప్రధాన పాత్రల్లో ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఆ చిత్రానికి ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. చంద్రబోస్ ఇన్నేళ్లలో ఎన్నో పాటలతో ఉర్రూతలూగించారు, కొన్నింటితో స్ఫూర్తినింపారు. ఎన్నో పద ప్రయోగాలు సృష్టించి, మెప్పించారు. ఇప్పుడు.. ఆస్కార్ పొందిన తొలి తెలుగు గేయ రచయితగా నిలిచారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WTC Final: ఇషాన్, భరత్.. తుది జట్టులో ఎవరు? అతడికే మాజీ వికెట్ కీపర్ మద్దతు!
-
Movies News
Kevvu Karthik: కాబోయే సతీమణిని పరిచయం చేసిన జబర్దస్త్ కమెడియన్
-
India News
Railway Board: గూడ్స్ రైలులో ఇనుప ఖనిజం.. ప్రమాద తీవ్రతకు అదీ ఓ కారణమే : రైల్వే బోర్డు
-
Politics News
Rahul Gandhi: తెలంగాణలోనూ భాజపాను తుడిచిపెట్టేస్తాం: రాహుల్ గాంధీ
-
Politics News
Nellore: తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డిపై దాడికి యత్నం
-
Politics News
Kodandaram: అవసరమైతే మా పార్టీ విలీనం: కోదండరామ్ ఆసక్తికర వ్యాఖ్యలు