P Vasu: ‘చంద్రముఖి 2’.. రజనీకాంత్‌ రిజెక్ట్‌ చేశారా..?: పి.వాసు ఏమన్నారంటే

‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) రిలీజ్‌లో భాగంగా చిత్రబృందం ప్రెస్‌మీట్‌లో పాల్గొంది. సినిమాకు సంబంధించిన పలు విశేషాలను విలేకర్లతో పంచుకుంది.

Updated : 24 Sep 2023 17:08 IST

హైదరాబాద్‌: రజనీకాంత్‌ (Rajinikanth), జ్యోతిక (Jyothika) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’ (Chandramukhi). 2005లో విడుదలైన ఈ చిత్రానికి సీక్వెల్‌గా ఇప్పుడు ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2) సిద్ధమైంది. రాఘవా లారెన్స్‌ (Raghava Lawrence), కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 28న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం తాజాగా ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొంది.

‘చంద్రముఖి 2’లో అవకాశం వచ్చినప్పుడు రజనీకాంత్‌ను సంప్రదించారా? ఆయన ఏమన్నారు?

లారెన్స్‌: ‘చంద్రముఖి 2’ కోసం వాసు గారు నన్ను ఎంచుకున్నారని తెలిసి షాక్‌ అయ్యా. ఆయన చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. దాంతో సినిమాలో నటిస్తానని చెప్పా. పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కష్టపడి వర్క్‌ చేశా. ఈ సినిమా ఆఫర్‌ వచ్చినప్పుడు రజనీకాంత్‌కు కాల్‌ చేశా. ఆయన ఆల్‌ ది బెస్ట్‌ అని చెప్పారు. ‘నా గురువు దీవెనలు నీక్కూడా ఉంటాయి’ అని చెప్పారు. ఈ సినిమా విషయంలో ముఖ్యంగా రజనీకాంత్‌కు ధన్యవాదాలు చెప్పాలి.

జ్యోతిక యాక్టింగ్‌ చూసినప్పుడు మీకు ఏం అనిపించింది?

కంగన: ఇప్పటివరకూ నేను ‘చంద్రముఖి’ చిత్రాన్ని రెండుసార్లు చూశా. క్లైమాక్స్‌లో జ్యోతిక నటన అత్యద్భుతంగా ఉంటుంది. ఆమె నటన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతుంది. సీక్వెల్‌లో భాగంగా ఒరిజినల్‌ చంద్రముఖి పాత్రలో యాక్ట్‌ చేయడం నాకొక సవాల్‌గా అనిపించింది. ఇప్పటివరకూ వచ్చిన వెర్షెన్స్‌ అన్నింటినీ మించి ఉండేలా పి.వాసు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన చెప్పిన విధంగానే ఈ పాత్రలో నటించాను.

Rakshit Shetty: అతడి సంగతి నాకు తెలియదు.. నేనైతే రష్మికతో మాట్లాడుతున్నా: రక్షిత్‌శెట్టి

సినిమాని వాయిదా వేయడానికి గల కారణం ఏమిటి?

పి.వాసు: ఈ చిత్రాన్ని మొదట నుంచి సెప్టెంబర్‌ 15నే విడుదల చేయాలనుకున్నాం. రిలీజ్‌కు సరిగ్గా వారం రోజుల ముందు 480 షాట్స్‌ ఫైల్స్‌ కనిపించడం లేదని నాకు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. షాకయ్యా. ఇలా కూడా జరుగుతుందా? అనిపించింది. దాదాపు 150 మంది టెక్నిషియన్స్ ఈ సినిమా కోసం వర్క్‌ చేస్తున్నారు. ఎక్కడ ఆ ఫైల్స్‌ మిస్‌ అయ్యాయో తెలియదు. ఏం చేయాలో తెలియక విడుదల తేదీని సెప్టెంబర్‌ 28కి వాయిదా వేశాం. 

‘చంద్రముఖి 3’ తీయాలనుకుంటున్నారా?

పి.వాసు: అవకాశం ఉంది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా చివర్లో వడివేలుతో.. ‘మళ్లీ రిపీటా..!’ అని ఓ డైలాగ్‌ చెప్పించాం.

ఈ కథను రజనీకాంత్‌ రిజెక్ట్‌ చేశారని వార్తలు వస్తున్నాయి?

పి.వాసు: ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. ఈ కథకు సంబంధించిన ఒక్క లైన్‌ కూడా రజనీకాంత్‌కు తెలియదు. భవిష్యత్తులో సమయం వచ్చినప్పుడు ఆయనతో కలిసి మళ్లీ సినిమా చేస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు