Veera Simha Reddy: బాలకృష్ణపై ప్రశంసలు కురిపించిన ‘వీరసింహారెడ్డి’ నటి

బాలకృష్ణ(Balakrishna) నటిస్తోన్న ‘వీరసింహారెడ్డి’(Veera Simha Reddy) సినిమాలోని పాటలో ఆయనతో కలిసి నటించిన చంద్రిక రవి(Chandrika Ravi) తన ఆనందాన్ని తెలిపింది. 

Published : 26 Dec 2022 17:46 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ(Balakrishna) హీరోగా గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం  ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy). ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమాలోని మూడు పాటలు యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా విడుదలైన ‘మాబావ మనోభావాలు..’ పాటలో బాలకృష్ణతో కలిసి చంద్రిక రవి(Chandrika Ravi) ఆడిపాడింది. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఈ అమ్మడు వీరసింహారెడ్డిలో బాలకృష్ణతో కలిసి పనిచేసిన అనుభవాన్ని ఓ వీడియో రూపంలో పంచుకుంది.

‘నేను దక్షిణాది సినిమాలు చూస్తూ పెరిగాను. బాలకృష్ణ నటించిన సినిమాలు, పాటలు చూసేదాన్ని. ఆయనతో కలిసి స్క్రీన్‌ పంచుకోవడమే కాదు. ఆయనతో కలిసి డ్యాన్స్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. మొదటిరోజు సెట్‌లోకి నడిచి వెళ్తుంటే ‘కల నిజమైంది’ అని నాలో నేను అనుకున్నాను. ఇక ఈ పాటకు సంగీతం, పాటలు, కొరియోగ్రఫీ, సెట్‌ డిజైన్‌, కాస్ట్యూమ్స్‌ అన్ని చాలా బాగా కుదిరాయి. బాలకృష్ణతో కలిసి ఎంతోసమయం గడిపే అవకాశం నాకు వచ్చింది. ఆయన జీవితానికి, కెరీర్‌కు సంబంధించిన అనేక విషయాలు నాతో పంచుకున్నారు. బాలకృష్ణ మోస్ట్‌ టాలెంటెడ్‌ నటుడు. ఆయనతో గడిపిన ఈరోజులను నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను’అంటూ బాలకృష్ణపై పొగడ్తల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌(Shruti Haasan) నటిస్తోన్న ఈ ‘వీరసింహారెడ్డి’ సినిమా సంక్రాతికి వినోదాన్ని పంచేందుకు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని