Nawazuddin siddiqui: ఇప్పుడిదో ఫ్యాషన్‌ అయిపోయింది

 కేజీఎఫ్-2, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలకు బాలీవుడ్‌లో విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే.

Published : 30 Apr 2022 02:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కేజీయఫ్-2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలకు బాలీవుడ్‌లో విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. అదే సమయంలో దక్షిణాది సినిమాలను అక్కడ రీమేక్‌ చేసేందుకు దర్శక-నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయంపై రామ్‌గోపాల్‌ వర్మ లాంటి వారు ఇప్పటికే బాలీవుడ్‌కు చురకలు అంటిస్తున్నారు. తాజాగా హిందీ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధిఖీ ఈ విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక సినిమా హిట్టయితే అంతా ఏకమై దాన్ని ఆకాశానికెత్తడం, అంతగా కలెక్షన్లు రాకుంటే వెంటనే విమర్శలు ఎక్కుపెట్టడం సాధారణమేనన్నారు. ఇప్పుడిదో ఫ్యాషన్‌ అయిపోయిందని.. ఈ పరిస్థితులు ట్రెండ్ లాగా ఎప్పటికప్పుడు మారుతుంటాయని తెలిపారు. బాలీవుడ్‌కు ఒక్క బ్లాక్‌ బస్టర్‌ పడితే అంతా సర్దుకుంటుందని అన్నారు. లాక్‌డౌన్‌లో అంతర్జాతీయ సినిమాలు చూసిన ప్రేక్షకుడి అభిరుచిలో మార్పు వస్తుందని ఊహించానన్నారు. మసాలా కంటెంట్‌తో వస్తున్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కానీ ఈ మార్పు అంత మంచిది కాదంటూ స్పందించారు.

అయితే తాము కూడా హీరో పంటి-2 వంటి కమర్షియల్‌ సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని..  కలెక్షన్ల పరంగా తమ సినిమా కూడా భారీ వసూళ్లు రాబట్టాలని కోరుకుంటున్నానన్నారు. ఈ ఏడాది పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన దక్షిణాది సినిమాలు బాలీవుడ్‌లోనూ కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని