Sankranti Movies: పెరిగిన బాలయ్య, చిరు సినిమా టికెట్‌ ధరలు.. ఏపీలో ఎంతంటే?

‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాల టికెట్‌ ధరల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

Updated : 11 Jan 2023 15:12 IST

అమరావతి:  సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy), చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) చిత్రాల టికెట్‌ ధరలు ఖరారయ్యాయి. రెండు చిత్రాల నిర్మాణ సంస్థ అయిన మైతీ మూవీ మేకర్స్‌.. పండగ నేపథ్యంలో టికెట్‌ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ ధరపై గరిష్ఠంగా రూ. 25 పెంచుతూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘వీరసింహారెడ్డి’ టికెట్‌ ధరను రూ. 20 మేర పెంచుకునేందుకు, ‘వాల్తేరు వీరయ్య’ టికెట్‌ ధర రూ. 25 పెంచుకునేందుకు వీలుగా అనుమతులు ఇచ్చింది. సినిమా విడుదలైననాటి నుంచి 10 రోజుల వరకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మరోవైపు, ఈ రెండు చిత్రాల స్పెషల్‌ షోలకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

బాలకృష్ణ (Balakrishna) హీరోగా గోపీచంద్‌ మలినేని తెరకెక్కించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ చిత్రమే ‘వీరసింహారెడ్డి’. చిరంజీవి (Chiranjeevi) హీరోగా కె. బాబీ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనరే ‘వాల్తేరు వీరయ్య’. ఈ రెండింటిలోనూ కథానాయికగా శ్రుతిహాసన్‌ (Shruti Haasan) నటించారు. బాలయ్య చిత్రం జనవరి 12న, చిరు చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకురానున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని