Artist Banerjee : చిరంజీవి బయోపిక్ తీస్తానని అనలేదు: నటుడు బెనర్జీ
ఇంటర్నెట్ డెస్క్: అనుకోకుండా సినిమాల్లోకి అరంగేట్రం.. ఆపై నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానం.. ముక్కుసూటి మనస్తత్వం.. నటుడిగా ఎత్తు పల్లాలు చూసినా ఏనాడూ వెనుదిరిగి చూడని నటుడు బెనర్జీ. నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకుడిగా తన అభిరుచిని చాటుకున్నారు. విలన్‌గానే కాదు.. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోయే నటుడాయన. ఈటీవీలో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. తన సినీ, నిజ జీవిత విశేషాలను ఆవిష్కరించారు.
ఇటీవల ‘ఆచార్య’లో చూశాం. ఇంకా ఏయే సినిమాలు రాబోతున్నాయి..?
బెనర్జీ: ప్రస్తుతం ‘విరాటపర్వం’ విడుదలకు సిద్ధంగా ఉంది. రానా, సాయి పల్లవి నటించారు. చాలా మంచి సినిమా. కొత్తవాళ్లతో రెండు, మూడు సినిమాలు చేస్తున్నా.
బాల్యం ఎక్కడ గడిచింది..?
బెనర్జీ: బాల్యం దిల్లీలో గడిచింది. హయ్యర్ సెకండరీ స్కూల్ బెజవాడలో సాగింది. గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్, మద్రాస్‌లో హోటల్ మేనేజ్‌మెంట్ చేశా. కానీ, పూర్తి చేయలేదు. నాన్న సినిమా ఇండస్ట్రీలో ఉండటంతో సినిమావాళ్లు పరిచయమయ్యారు.
మీ నాన్న సినిమాల్లోకి ఎప్పుడు వచ్చారు..?
బెనర్జీ: ఆయన ఆర్టిస్ట్. హీరోగా చేయాలని తీసుకొచ్చారు. ‘వీరాంజనేయ’లో లక్ష్మణుడి పాత్ర వేశారు. ‘బ్రహ్మచారి’, ‘కథానాయకుడు’ తదితర చిత్రాల్లో నటించారు. ‘భరత్ అనే నేను’లో ఇద్దరం కలిసి నటించాం. విశ్వనాథ సత్యనారాయణగారి ‘వేయిపడగలు’ నవలను పీవీగారు హిందీలో రాశారు. టీవీ సీరియల్‌కు ఇద్దరం చేశాం.
అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎవరి వద్ద పని చేశారు..?
బెనర్జీ: మొదట యు. విశ్వేశ్వరరావు ‘హరిశ్చంద్రుడు’ సినిమాని ప్రభాకర్‌రెడ్డి, సావిత్రితో చేస్తున్నారు. సావిత్రిగారిని అదే చూడటం, మాకు అమ్మలాగా అనిపించేది. అదే ఆమె చివరి సినిమా. ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టరైనా నన్నూ నటింపజేశారు. దానికి జాతీయ అవార్డు వచ్చింది. తర్వాత లక్ష్మీ ప్రొడక్షన్‌లో దర్శకుడు తాతినేని రామారావు దగ్గర అసిస్టెంట్‌గా చేరా. చాలా సినిమాలు హిందీలోనే ఉన్నాయి.
నటుడిగా మళ్లీ ఎలా మారిపోయారు..?
బెనర్జీ: జూనియర్ ఆర్టిస్టులు సరిగా చేసేవారు కాదు. దీంతో గ్యాప్ రాకుండా ఉండాలని మధ్యలో వెళ్లడం, అవసరమైతే డైలాగ్ కూడా చెప్పేవాళ్లం. ‘ఇంక్విలాబ్’లో అమితాబ్ హీరో, శ్రీదేవి హీరోయిన్. అది కన్నడ రీమేక్. అందులోని నటుడు ఒకతను ఇందులో నటిస్తున్నారు. షూటింగ్ రోజు రాలేదు. అమితాబ్‌తో చెబితే ‘బెనర్జీ ఉన్నాడు కదా చేసేస్తాడు’ అని అనడంతో అందరూ ఓకే చేశారు. చిన్న ఫైట్, ఇతరత్రా డైలాగులున్నాయి.
400 సినిమాలు చేశారు. అందులో ఎన్నో మైల్‌స్టోన్స్ ఉండి ఉంటాయి..? మీకు బాగా గుర్తింపు తీసుకొచ్చినవేవి..?
బెనర్జీ: 1985లో నానాపటేకర్ వేషం వేశా. అందులో రజనీకాంత్ హీరో. తర్వాత చాలా చేశా. ఆర్జీవీ ‘గాయం’, ‘జైత్రయాత్ర’లో మంచి పాత్ర వేశాను. తేజ ‘నువ్వు నేను’ ఇలా చాలా సినిమాలు చేశాం.
చిరంజీవిపై బయోపిక్ తీయాలని అన్నారట..అవసరమైతే ‘నేనే తీస్తా’ అన్నారని విన్నాం?
బెనర్జీ: అలాంటిదేమీ లేదు. రాంగ్ కాన్సెప్ట్. అవన్నీ యూట్యూబ్‌లో రాసేస్తారు. శీర్షిక చూడగానే చదువుతారని రాస్తారు. అది నిజం కాదు. చిరంజీవి చాలా మంచి మనిషి. ఆయన దగ్గర నటుడిగా ఎన్నో నేర్చుకోవాలి. ఎవరెన్ని తిట్టినా, ఏమన్నా పట్టించుకోరు. ఒక స్టేజీ మీద మాట్లాడుతూ చిరంజీవి అనుమతి తీసుకొని ఆయన పడిన బాధలు, కష్టాలు, అవమానాలు, విజయాలను ఒక సినిమాగా తీయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పా. కానీ నేను చేస్తానని చెప్పలేదు. చిరంజీవి చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఆయన చేసే సేవలు కొన్ని మాత్రమే తెలుస్తున్నాయి. ఇంకా చాలా ఎవరికీ తెలియవు. సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్‌లు కాకుండా బయటి వాళ్లకు కూడా కొవిడ్ సమయంలో చాలా సహాయం చేశారు.
మీరు నిర్మాతగా మారిన తర్వాత ఏయే సినిమాలు చేశారు..? ఎందుకు నిర్మాతగా మారారు..?
బెనర్జీ: మాతో ఉన్న వారిలో కో-డైరెక్టర్లు మోహన్‌గాంధీ, నందకుమార్, విశ్వం, షిండే ఉన్నారు. నందకుమార్‌కు డైరెక్టర్ కావాలని ఉన్నా అవకాశాలు రాలేదు. ఆయన కోసం సినిమా తీశా. ‘ధర్మ యుద్ధం’ చేశాం. ‘వన్స్‌మోర్’ తీసినా సీరియస్‌గా తీసుకోలేదు. నాకు పని కావాలి. దాని కోసమే ఏదో ఒకటి చేశా.
మీకు బాగా మనస్తాపం, బాధ కలిగించిన సంఘటనలు ఉన్నాయా..?
బెనర్జీ: పెద్దగా ఏమీ లేవు. నాకు మొదటి నుంచి అందరూ తెలిసిన వాళ్లే. మనం ఎలా ఉంటే.. ఇతరులు అలాగే ఉంటారనే అభిప్రాయం నాది. ఒకట్రెండు సినిమాలకు అడ్వాన్సు ఇచ్చి, దుస్తులు కుట్టించిన తర్వాత వద్దన్నారు.
కమ్యూనిస్టు భావాలు ఉన్నాయని విన్నాం. నిజమేనా..?
బెనర్జీ: రకరకాల పేర్లు పెట్టినా.. నా వరకు అందరూ గౌరవించుకోవాలి. సమానత్వం ఉండాలని కోరుకుంటా.
ఆర్జీవీ, కృష్ణవంశీతో చేశారు. వీరితో ఎలాంటి అనుబంధం ఉంది..?
బెనర్జీ: ఆర్జీవీతో గాయం, సత్య చేశా. వంశీతో గులాబీ చేశా. మా అభిప్రాయాలు ఒకే రకంగా ఉండటంతో కలిసి పోయాం.
నటనతో పాటు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌లో పని చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది..?
బెనర్జీ: సినీ పెద్దలు ఆరంభించారు. నేను అందులో పాలు పంచుకున్నా. సాధ్యమైనంత వరకూ సేవ చేసే అవకాశం లభించింది.
మీ తరంతో పోల్చుకుంటే ఇప్పటి వారికి అవకాశాలు సులువుగా లభిస్తున్నాయనిపిస్తోందా?
బెనర్జీ: అవకాశాలు ఎప్పుడూ తేలికగా రావు. కాకపోతే అవకాశాలు పెరిగాయి. అందుకే చాలా మంది నటించేందుకు వీలు దొరికింది.
భవిష్యత్తులో సినిమా రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
బెనర్జీ: సినిమా థియేటర్లు తగ్గిపోతాయి. వాటికొచ్చే సినిమాలు తగ్గిపోనున్నాయి. సమయం ఇతరత్రా కారణాలతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోతుంది. అంతా ఓటీటీకి వెళ్తారు. గతంతో పోలిస్తే చాలా మార్పులు వచ్చాయి. మెరుగైన మార్పులు చూస్తున్నాం.
లిఫ్ట్ ఇండియా చిత్రోత్సవంలో 40 దేశాల నుంచి 250 సినిమాలు ఎంపికైతే మీరు నటించిన ‘రక్తం’కు ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది కదా!
బెనర్జీ: చాలా సంతోషంగా భావించిన సినిమా రక్తం. రాజేష్ మళయాళీ డైరెక్టర్. గతంలో నా చిట్టితల్లీ సినిమా చేశారు. జాతీయ అవార్డు వచ్చింది. రక్తంలో ప్రధాన పాత్రకు చేయాలని అడిగారు. గత 40 ఏళ్లుగా ఇలాంటి సినిమా కోసం చూస్తున్నా అని చెప్పా. అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ యాక్టర్ అవార్డు అంటే డైరెక్టర్, నిర్మాతతో కలిసి వెళ్లాం..కానీ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. నాకు రాలేదు. తర్వాత లిఫ్ట్ ఇండియా చిత్రోత్సవంలో ప్రదర్శించారు. నేను బయటకు వెళ్లినపుడు బెస్ట్ యాక్టర్ అవార్డు ప్రకటించారని డైరెక్టర్ వచ్చి చెప్పారు.
అమితాబ్ బచ్చన్ సినిమాలో అవకాశం వస్తే తిరస్కరించారని విన్నాం. నిజమేనా..?
బెనర్జీ: అమితాబ్ నేను డైరెక్టు చేస్తే నటిస్తానన్నారు. పూర్ణ చంద్రరావు ఓకే చెప్పారు. కానీ నేను డైరెక్టర్‌గా చేయనని చెప్పా.
మీకు షూటింగ్ లొకేషన్‌లో బాగా కోపం వచ్చిన సందర్భం ఉందా..?
బెనర్జీ: ఒకసారి అమితాబ్ అంధాకానూన్ సినిమా చేస్తున్నాం. చైల్డ్ సెంటిమెంటు. అమితాబ్ అమ్మాయికి చాక్లెట్ ఇస్తారు. అమ్మాయి చనిపోతే చాక్లెట్ పెట్టాలి. సమయానికి చాక్లెట్ లేదు. 5 కి.మీ దూరం వెళ్లి చాక్లెట్ తీసుకొచ్చి షూటింగ్ పూర్తి చేశాం. ఎవరి పని వారు చేయకపోతే అరుస్తాం. అందరం మనుషులమే కదా..!
‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌కు మద్దతు ఇచ్చారు. మోహన్‌బాబుతో ఎంత సన్నిహితంగా ఉన్నా దూరంగానే ఉన్నారు..?
బెనర్జీ: ప్రకాశ్‌రాజ్ ఏడాది ముందే చెప్పారు. సేవా కార్యక్రమాలు చాలా చేస్తారు. మోహన్‌బాబుకు కూడా చెప్పారు. తర్వాత ఏమయ్యిందో విష్ణుని తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రకాశ్‌రాజ్‌ను చేద్దాం. రెండేళ్ల తర్వాత విష్ణుకు అవకాశం ఇద్దామని చిరంజీవి చెప్పారు. అయినా మోహన్‌బాబు విష్ణుకు మద్దతు ఇవ్వాలని కోరారు. కుదరదని చెప్పా. ఎన్నికల్లో మోహన్‌బాబు ఇష్టం వచ్చినట్టు తిట్టారు. చాలా హర్ట్ అయ్యా. అందుకే బయటకు వచ్చాం.
మీ కుటుంబం గురించి చెప్పండి?
బెనర్జీ: ఒక అమ్మాయి. కొవిడ్ సమయంలోనే అమెరికాలో పెళ్లి చేశాం. నా భార్య నుంచి నేను చాలా నేర్చుకున్నా.
కొత్తగా వచ్చే నటులకు మీరిచ్చే సలహా?
బెనర్జీ: మంచీ, చెడూ తెలుసుకొని పని చేయాలి. నటులు ఎవరికైనా కష్టనష్టాలు వస్తాయి. భయపడొద్దు. క్రమశిక్షణ, సమయపాలన కలిగి ఉండాలి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Kerala: ఒకరికి అండగా మరొకరు.. ఒకేసారి ప్రభుత్వ కొలువు సాధించిన తల్లి, కుమారుడు
-
India News
Internet shutdowns: ఇంటర్నెట్ సేవల నిలిపివేతలు భారత్‌లోనే ఎక్కువ.. కాంగ్రెస్ ఎంపీ
-
Sports News
PV Sindhu: కామన్వెల్త్లో ‘మూడు’ గెలవడం అమితానందం: పీవీ సింధు
-
India News
Quit India: నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..!
-
Movies News
Aamir Khan: ‘కేబీసీ’లో ఆమిర్ ఖాన్.. ఎంత గెలుచుకున్నారంటే?
-
World News
Zaporizhzhia: ఆ ప్లాంట్ పరిసరాలను సైనికరహిత ప్రాంతంగా ప్రకటించాలి: ఉక్రెయిన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Asia Cup 2022: ఆసియా కప్ టోర్నీకి బుమ్రా దూరం.. టీమ్ఇండియా జట్టు ఇదే!
- Aaditya Thackeray: ఆ ఇద్దరిలో నిజమైన ముఖ్యమంత్రి ఎవరు?.. ఆదిత్య ఠాక్రే
- Chinese mobiles: చైనాకు భారత్ మరో షాక్.. ఆ మొబైళ్లపై నిషేధం...?
- venkaiah naidu: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి ఘనమైన వీడ్కోలు
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్‌లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్‌ప్రీత్ కౌర్
- CWG 2022: భారత్‌కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
- iPhone 14: యాపిల్ ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. ఐఫోన్ 14 రాక ఆలస్యం?
- Sex Life: శృంగార జీవితం బాగుండాలంటే ఈ పొరపాట్లు వద్దు!
- Quit India: నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. 1942 మాదిరి ఉద్యమం అవసరమే..!