Pathu Thala: వారికి థియేటర్‌లోకి నో ఎంట్రీ.. వీడియో వైరల్‌..

తమిళనాడులోని ఓ థియేటర్‌ సిబ్బంది.. పలువురు ప్రేక్షకులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. సిబ్బంది తీరు వైరల్‌కావడంతో సంబంధిత యాజమాన్యం వివరణ ఇచ్చింది.

Published : 30 Mar 2023 19:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ థియేటర్‌ సిబ్బంది ప్రేక్షకులపై వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. సంబంధిత వీడియోను పలువురు ట్విటర్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌ అయింది. ఆ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా సినిమా థియేటర్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ (#BoycottRohiniTheatre) పోస్ట్‌లు పెట్టారు. దాంతో యాజమాన్యం ఈ వివాదంపై సోషల్‌ మీడియా వేదికగా వివరణ ఇచ్చింది.

జరిగిందేంటంటే?.. తమిళ్‌ స్టార్‌ హీరో శింబు (Simbu) నటించిన తాజా చిత్రం ‘పతు తలా’ (Pathu Thala). శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న విడుదలైంది. ఈ సినిమా చూసేందుకు  రోహిణి థియేటర్‌కు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వెళ్లారు. అయితే, వారిలో గిరిజన కుటుంబానికి చెందిన కొందరిని థియేటర్‌ సిబ్బంది లోపలికి అనుమతించలేదని, టిక్కెట్‌ ఉన్నా ఆ కుటుంబాన్ని థియేటర్‌ బయటే నిలిపివేశారంటూ కొందరు వీడియోలు పోస్ట్‌ చేశారు. నెటిజన్లతోపాటు పలువురు సినీ ప్రముఖులూ దానిపై స్పందించారు. థియేటర్‌ సిబ్బంది తీరును తప్పు పడుతూ ట్వీట్లు చేశారు. చివరకు థియేటర్‌ యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా వివరణ ఇచ్చింది. 

‘‘ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చింది. కాబట్టి చట్టప్రకారం 12 ఏళ్ల లోపు పిల్లలను అనుమతించకూడదు. ఆ కుటుంబం 12 ఏళ్ల లోపు ఉన్న నలుగురు పిల్లలతో కలిసి వచ్చింది. అందుకే వాళ్లని మా సిబ్బంది ఆపేశారు. తర్వాత కొంత సేపటికి వారిని అనుమతించాం’’ అంటూ అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేసింది. అయితే నెటిజన్లు ఈ వివరణను అంగీకరించలేదు.సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు