Chennakesava Reddy: మరోసారి చెన్నకేశవ రెడ్డి సందడి

బాలకృష్ణ - వి.వి.వినాయక్‌ కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ సినిమా ‘చెన్నకేశవ రెడ్డి’. 2002 సెప్టెంబరు 25న విడుదలైన ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకొంది. ఇది విడుదలై 20ఏళ్లు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో..

Updated : 23 Sep 2022 06:52 IST

బాలకృష్ణ (Balakrishna) - వి.వి.వినాయక్‌ (VV Vinayak) కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ సినిమా ‘చెన్నకేశవ రెడ్డి’ (Chennakesava Reddy). 2002 సెప్టెంబరు 25న విడుదలైన ఈ మాస్‌ యాక్షన్‌ చిత్రం బాక్సాఫీస్‌ ముందు సంచలన విజయాన్ని అందుకొంది. ఇది విడుదలై 20ఏళ్లు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడీ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్ర బృందం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్‌ (Bellamkonda Suresh) గురువారం హైదరాబాద్‌లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆరోజుల్లో వినాయక్‌ ఈ చిత్రాన్ని ఒక పూనకం వచ్చేలాగా తీశారు. 20ఏళ్ల కిందట ఎంత క్రేజీగా ఈ చిత్రాన్ని నిర్మించామో.. ఇప్పుడంతే ఉత్సాహంగా సినిమా రీరిలీజ్‌ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈనెల 24న ప్రీమియర్స్‌ మొదలవుతాయి. 25న రెగ్యులర్‌ షోలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు మూడొందల థియేటర్స్‌లో సినిమాని ప్రదర్శిస్తున్నాం. ఈ చిత్రానికి వచ్చే ఆదాయంలో 75శాతం బసవతారకం ట్రస్ట్‌కు, మిగతాది నాకు సంబంధించిన అసోసియేషన్స్‌కు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’’ అన్నారు. ‘‘మంచి ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రీరిలీజ్‌ చేస్తున్నాం. దీన్ని ప్రేక్షకులు, అభిమానులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు దర్శకుడు వి.వి.వినాయక్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని