డీజే బాలనటుడు ఇప్పుడు హీరోగా..

సాత్విక్‌ వర్మ బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ‘బాహుబలి’, ‘రేసుగుర్రం’, ‘మళ్లీ రావా’, ‘దువ్వాడ జగన్నాథం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు.

Published : 24 May 2021 17:53 IST

హైదరాబాద్‌: సాత్విక్‌ వర్మ బాలనటుడిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. ‘బాహుబలి’, ‘రేసుగుర్రం’, ‘మళ్లీ రావా’, ‘దువ్వాడ జగన్నాథం’ తదితర చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు ఆయన కథానాయకుడిగా ‘బ్యాచ్‌’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో సాత్విక్‌ వర్మకి జోడీగా నేహా పఠాన్‌ నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్‌ ఘనమజ్జి నిర్మాత. రఘు కుంచె సంగీతం సమకూరుస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుకొంటోంది.

దర్శకుడు మాట్లాడుతూ ‘‘క్రికెట్‌ బెట్టింగ్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. పోకిరీలుగా ముద్ర పడిన కొంతమంది కుర్రాళ్ల జీవితంలో జరిగిన సంఘటనలు ఎలాంటివనేది తెరపైనే చూడాలి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘సాత్విక్‌ వర్మని మా చిత్రంతో కథానాయకుడిగా పరిచయం చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు శివ రాసిన కథ, ఆయన చిత్రాన్ని తెరకెక్కించిన తీరు బాగుంది. రఘు కుంచె పాటలు అలరిస్తాయి’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని