Adipurush: ‘ఆదిపురుష్‌’ ప్రీరిలీజ్‌కు అతిథిగా చినజీయర్‌ స్వామి

‘ఆదిపురుష్‌’ (Adipurush) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు అతిథిగా చినజీయర్‌ స్వామి రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది.

Published : 05 Jun 2023 12:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం సోషల్‌ మీడియా అంతా ‘ఆదిపురుష్‌’ (Adipurush) పోస్టర్లతో నిండిపోయింది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు అతిథిగా ఎవరు వస్తారంటూ మూవీ యూనిట్‌ రెండు రోజుల నుంచి అభిమానుల్లో ఆసక్తి పెంచుతూ పోస్టర్లు విడుదల చేసింది. తాజాగా ఆ అతిథి ఎవరో చెబుతూ ట్వీట్‌ చేసింది.

రేపు (జూన్‌ 6) తిరుపతిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చినజీయర్‌ స్వామి (Chinna jeeyar swamy) అతిథిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్రబృందం ట్వీట్‌ చేసింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రభాస్‌ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారు. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లోనూ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా నిర్వహించనున్నట్లు సమాచారం. అందుకే చినజీయర్‌ స్వామిని ఆహ్వానించారట. ఇక ఈ వేడుకలో దాదాపు 200 మంది సింగర్స్‌, 200 మంది డ్యాన్సర్లు ప్రదర్శన ఇవ్వనున్నారట. అలాగే దీని కోసం బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అతుల్‌ ముంబయి నుంచి తిరుపతికి బైక్‌పై రానున్నారు.

ఓంరౌత్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు, ట్రైలర్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. రాముడిగా ప్రభాస్‌ నటిస్తుండగా.. సీతగా కృతిసనన్‌ కనిపించనుంది. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, హనుమాన్‌గా దేవదత్త నాగే నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు