Chinni: నీతో కలిపి 25 హత్యలు.. వైలెంట్‌ పాత్రలో కీర్తి సురేశ్‌!

‘ఇప్పుడున్న కోపంలో నీ వెన్నెముక లాగి, నీ ఆసనంలో పొడిచి చంపేయాలని ఉంది. దీంతో నీతో కలిపి 25 హత్యలు అవుతాయి’ అంటూ

Published : 26 Apr 2022 15:07 IST

హైదరాబాద్‌: ‘ఇప్పుడున్న కోపంలో నీ వెన్నెముక లాగి, నీ ఆసనంలో పొడిచి చంపేయాలని ఉంది. దీంతో నీతో కలిపి 25 హత్యలు అవుతాయి’ అంటూ హెచ్చరిస్తోంది కీర్తి సురేశ్‌(Keerthy suresh). సెల్వరాఘవన్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘చిన్ని’(Chinni). అరుణ్‌ మథేశ్వరం దర్శకుడు. ఇప్పటి వరకూ గ్లామర్‌ పాత్రలతో పాటు, ‘మహానటి’ వంటి కథాబలమున్న క్యారెక్టర్‌లతో ప్రేక్షకులను మెప్పించిన కీర్తి సురేశ్‌ ‘చిన్ని’తో ఓ విభిన్న పాత్రలో అలరించేందుకు సిద్ధమయ్యారు. కొన్ని సన్నివేశాల్లో ఆమెను చూస్తుంటే, ‘మహానటి’లో చేసిన కీర్తి సురేశేనా అన్నంతలా అదరగొట్టారు. పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన చిన్ని అనే యువతి రంగయ్యతో కలిసి 24 హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఇంతకీ రంగయ్యకు, చిన్నికీ ఉన్న సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. మే 6న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ప్రైమ్‌ వీడియో వేదికగా ‘చిన్ని’ స్ట్రీమింగ్‌ కానుంది. శ్యామ్‌ సీఎస్‌ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని