Chiranjeevi: చిరంజీవా.. మజాకా! ఒకే నెలలో నాలుగు సినిమాల్లో..

హీరోలంతా తాము నటించబోయే సినిమాలను వరుసపెట్టి ప్రకటించడం సాధారణమే. కానీ.. ఒక చిత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత మరో సినిమాలో నటిస్తుంటారు. అయితే, మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటిస్తూ అరుదైన రికార్డు సృష్టించారు. ఒకే నెలలో అత్యధిక సినిమాలు చేస్తోన్న నటుడిగా ఘనత సాధించారు. 

Updated : 17 Aug 2022 11:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోలంతా తాము నటించబోయే సినిమాలను వరుసపెట్టి ప్రకటించడం సాధారణమే. కానీ.. ఒక చిత్రం షూటింగ్‌ పూర్తయిన తర్వాత మరో సినిమాలో నటిస్తుంటారు. అయితే, మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం ఏకంగా ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించడం విశేషం. ఒకే నెలలో అత్యధిక సినిమాలు చేస్తూ ప్రస్తుతం యువహీరోలకు కూడా సాధ్యం కాని విధంగా ముందుకెళ్తున్నారు.

గతేడాది తాను చేయబోయే చిత్రాల గురించి చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తన 152వ చిత్రం ‘ఆచార్య’లో నటిస్తోన్న చిరు.. తన 153వ సినిమాగా రానున్న లూసిఫర్‌ రీమేక్‌ ‘గాడ్‌ ఫాదర్‌’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మోహన్‌రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ కొన్ని నెలల కిందట ప్రారంభమైంది. ఇక మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’, బాబీ దర్శకత్వం వహిస్తున్న మరో సినిమా చిత్రీకరణ కూడా ఈ మధ్యే ప్రారంభమైంది. ఈ నెలలో ఆ నాలుగు సినిమా పనులతో చిరంజీవి బిజీగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని