Fathers Day: ఫాదర్స్‌ డే.. స్పెషల్‌ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్‌

ఫాదర్స్‌ డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు స్పెషల్‌ ఫొటోలు పంచుకుంటూ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated : 16 Jun 2024 12:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫాదర్స్‌ డేని (Father's Day) పురస్కరించుకుని ప్రముఖ హీరోలు చిరంజీవి (Chiranjeevi), అల్లు అర్జున్‌ (Allu Arjun) తదితరులు సోషల్‌ మీడియా వేదికగా స్పెషల్‌ ఫొటోలు పంచుకున్నారు. అభిమానులకు విషెస్‌ తెలిపారు. ‘ప్రతి బిడ్డకు నాన్నే తొలి హీరో’ అంటూ గతంలో తన తండ్రితో కలిసి దిగిన స్టిల్‌ను చిరంజీవి షేర్‌ చేశారు. ‘ప్రపంచంలోని తండ్రులందరికీ.. హ్యాపీ ఫాదర్స్‌ డే’ అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫొటోను అల్లు అర్జున్‌ పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌లపై స్పందించిన ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెట్టింట వైరల్‌గా మారాయి.

  • ‘‘సన్నిహితులారా.. తండ్రిని దైవంగా భావించిన వారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. హ్యాపీ ఫాదర్స్‌ డే’’ - మంచు మోహన్‌ బాబు
  • తన తండ్రి నాగార్జునతో కలిసి బాల్యంలో దిగిన ఫొటోను నాగచైతన్య షేర్‌ చేశారు. ‘ది ఓజీ’ అని క్యాప్షన్‌ పెట్టారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని