Chiranjeevi: ‘నాటునాటు’కు గోల్డెన్‌ గ్లోబ్‌.. దేశం గర్విస్తోంది: చిరంజీవి

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు(RRR) గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు (Golden Globes) వరించడంపై సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు.  

Updated : 11 Jan 2023 14:51 IST

హైదరాబాద్‌: ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు(Naatu Naatu) ప్రతిష్ఠాత్మక పురస్కారం ‘గోల్డెన్‌ గ్లోబ్‌’ (Golden Globe) అందడం పట్ల అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) హర్షం వ్యక్తం చేశారు. ఇదొక చారిత్రక విజయమంటూ.. దీనిపట్ల దేశం గర్విస్తోందన్నారు. ఈమేరకు సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani), ఇతర చిత్ర బృందాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ‘‘ఇదొక అద్భుతమైన, చారిత్రక విజయం. ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటునాటు’కి గానూ కీరవాణి గోల్డెన్‌గ్లోబ్‌ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌కు నా అభినందనలు. దేశం మిమ్మిల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్.. ఈ రెండింటి సెలబ్రేషనే ‘నాటునాటు’. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈరోజు మీతో కలిసి డ్యాన్స్‌ చేస్తోంది. చరణ్ (Ram Charan)‌, తారక్‌ (NTR)తోపాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్‌, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్‌, కాలభైరవ, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌కు కంగ్రాట్స్‌’’ అని పేర్కొన్నారు.

‘‘కంగ్రాట్స్‌ సర్‌ జీ. నా కెరీర్‌లో ఇప్పటివరకూ ఎన్నో పాటలకు డ్యాన్స్‌ చేశాను. కానీ, ‘నాటు నాటు’ ఎప్పటికీ నా హృదయానికి చేరువగానే ఉంటుంది’’

- ఎన్టీఆర్‌

‘‘ఇదొక అద్భుతమైన మార్పు. భారతీయులందరూ ముఖ్యంగా మీ అభిమానుల తరఫున కీరవాణి, రాజమౌళి, చిత్రబృందం మొత్తానికి అభినందనలు’’

- ఏ ఆర్‌ రెహమాన్‌

‘‘ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న కీరవాణికి హృదయపూర్వక అభినందనలు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ భవిష్యత్తులో మరెన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’’

- క్రిష్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని