Ali: ఆలీ కుమార్తె వివాహంలో సెలబ్రిటీల సందడి

ప్రముఖ హాస్య నటుడు ఆలీ కుమార్తె  వివాహం వేడుకగా జరిగింది. సినీ ప్రముఖులు వివాహ వేడుకలో పాల్గొని సందడి చేశారు.

Published : 28 Nov 2022 09:46 IST

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు ఆలీ (Ali) పెద్ద కుమార్తె ఫాతిమా (Fathima) వివాహం ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి - సురేఖ, నాగార్జున - అమల దంపతులు, ఏపీ మంత్రి రోజాతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను రోజా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. నెటిజన్లు సైతం నూతన జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని