Nani: కొత్త చిత్రానికి శ్రీకారం
కథానాయకుడు నాని (Nani) కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన నటిస్తున్న ఈ 30వ సినిమాతో శౌర్యువ్ అనే మరో కొత్త దర్శకుడు తెరకు పరిచయమవుతున్నారు.
కథానాయకుడు నాని (Nani) కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఆయన నటిస్తున్న ఈ 30వ (Nani 30) సినిమాతో శౌర్యువ్ అనే మరో కొత్త దర్శకుడు తెరకు పరిచయమవుతున్నారు. చెరుకూరి మోహన్, విజయేందర్ రెడ్డి, మూర్తి కలగర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయిక. ఈ సినిమా మంగళవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి (Chiranjeevi) క్లాప్ కొట్టగా.. అశ్వినీదత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ఠ, వివేక్ ఆత్రేయ సంయుక్తంగా గౌరవ దర్శకత్వం వహించారు. విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ అందించారు. తండ్రీకూతుళ్ల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. బుధవారం నుంచే రెగ్యులర్ చిత్రీకరణ మొదలుకానుంది. సంగీతం: హేషమ్ అబ్దుల్ వహాబ్, కూర్పు: ప్రవీణ్ ఆంటోని, ఛాయాగ్రహణం: సాను జాన్ వర్గీస్.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
-
World News
Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా.. ’: బైడెన్ వీడియో వైరల్
-
India News
Hand Writing: పెన్ను పెడితే.. పేపర్‌పై ముత్యాలే
-
Crime News
Hyderabad: కుమారుల అనారోగ్యంపై మనస్తాపం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
-
India News
పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు
-
India News
Sukesh chandrasekhar: ‘నా బుట్టబొమ్మ జాక్వెలిన్‌కు’.. జైలు నుంచే సుకేశ్ మరో ప్రేమలేఖ