Telugu movies: చిరు మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌.. ‘అఖండ’ నిర్మాతతో శ్రీకాంత్‌ అడ్డాల

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) జోరుమీదున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa shankar).

Published : 30 May 2023 15:54 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) జోరుమీదున్నారు. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్‌’ (Bholaa shankar). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్‌డేట్‌ను చిత్ర బృందం పంచుకుంది. త్వరలోనే ‘భోళా మేనియా మొదలు కానుంది’ అంటూ చిరు స్టెప్‌ వేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది. అంటే సినిమాకు సంబంధించిన ఏదైనా పాటలను విడుదల చేసే అవకాశం ఉంది.  మహతి స్వర సాగర్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం విశేషం. తమన్నా కథానాయికగా నటిస్తున్న ‘భోళా శంకర్‌’లో కీర్తి సురేష్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఆగస్టు 11న  సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘అఖండ’ నిర్మాతతో శ్రీకాంత్‌ అడ్డాల

‘నారప్ప’తో వెంకటేష్‌ను సరికొత్తగా చూపించారు శ్రీకాంత్‌ అడ్డాల. ఇప్పుడు మరో ఆసక్తికర చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. బాలకృష్ణతో ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను తీసిన  ద్వారక క్రియేషన్స్‌ పతాకంపై శ్రీకాంత్‌ ఓ సినిమా తీస్తున్నారు. నటీనటులు ఇతర వివరాలను జూన్‌ 2న ప్రకటించనున్నారు. కేవలం చేతిని పైకెత్తి ఉన్న ఫొటోను మాత్రమే షేర్‌ చేశారు. మిర్యాల రవీందర్‌రెడ్డి  ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు