Chiranjeevi: ‘ఆచార్య’ ఫెయిల్యూర్‌.. దర్శకుడు చెప్పిందే మేము చేశాం: చిరంజీవి

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆచార్య’ (Acharya) పరాజయంపై మెగాస్టార్‌ చిరంజీవి (Chairanjeevi) పెదవి విప్పారు. ‘గాడ్‌ ఫాదర్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా ‘ఆచార్య’ ఫ్లాప్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 02 Oct 2022 01:34 IST

హైదరాబాద్‌: భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆచార్య’ (Acharya) పరాజయంపై మెగాస్టార్‌ చిరంజీవి (Chairanjeevi) తొలిసారి పెదవి విప్పారు. ఆ సినిమా అపజయం తనను ఏమాత్రం బాధించలేదన్నారు. ‘గాడ్‌ఫాదర్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ‘ఆచార్య’ ఫ్లాప్‌పై స్పందించారు.

‘‘కెరీర్‌ ప్రారంభమైన కొత్తలో విజయం వచ్చినప్పుడు బాగా ఆనందించేవాడిని. పరాజయం వస్తే బాధపడేవాడిని. కానీ ఆ రోజులు గడిచిపోయాయి. మొదటి 15 సంవత్సరాల్లోనే ఎన్నో ఎదుర్కొన్నాను. మానసికంగా, శారీరకంగా అన్నింటినీ తట్టుకోవడం తెలుసుకున్నాను. నటుడిగా పరిణతి చెందిన తర్వాత సినిమా పరాజయాలు నన్నెప్పుడూ బాధపెట్టలేదు. విజయాన్ని తలకెక్కించుకోలేదు’’

‘‘సినిమా ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. మన పనిలో మనం బెస్ట్‌ ఇస్తామంతే. ‘ఆచార్య’ పరాజయం నన్నస్సలు బాధించలేదు. ఎందుకంటే దర్శకుడు చెప్పిందే మేము చేశాం. ఈ సినిమా విషయంలో ఉన్న ఒకే ఒక్క చిన్న విచారం ఏంటంటే.. చరణ్‌ నేను కలిసి మొదటిసారి సినిమా చేశాం. అది హిట్‌ కాలేదు. ఒకవేళ భవిష్యత్తులో మేము మళ్లీ కలిసి పనిచేయాలనుకుంటే ఇంతటి జోష్‌ రాకపోవచ్చు. అంతకు మించి ఎలాంటి బాధ లేదు’’ అని చిరంజీవి వివరించారు.

ధర్మస్థలి, పాదఘట్టం అనే ఆసక్తికర అంశాలతో రూపొందించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఎన్నో అంచనాల మధ్య ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. ఇక, చిరంజీవి ప్రస్తుతం ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకొన్న ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ఇది సిద్ధమైంది. మోహన్‌రాజా దర్శకుడు. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని