BA Raju: ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వాళ్లుండరు

సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత, పీఆర్వో బీఏ రాజు అకాలమరణంతో చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. బీఏ రాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకుంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు....

Published : 22 May 2021 09:52 IST

పీఆర్వో మృతిపట్ల చిరు సంతాపం

హైదరాబాద్‌: సీనియర్‌ సినీ జర్నలిస్ట్‌, నిర్మాత, పీఆర్వో బీఏ రాజు అకాలమరణంతో చిరంజీవి దిగ్భ్రాంతికి గురయ్యారు. బీఏ రాజుతో తనకున్న సాన్నిహిత్యాన్ని నెమరువేసుకుంటూ సోషల్‌మీడియా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. తాను మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి బీఏ రాజుతో పరిచయం ఉందని తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన ఎన్నో విషయాలను ఆయన పూసగుచ్చినట్లు చెప్పేవారని చిరు పేర్కొన్నారు.

‘బీఏరాజు.. ఈ పేరు తెలియని వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో ఉండరు. మద్రాసులో ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించిన ఎన్నో విశేషాల్ని ఆయన నాతో పంచుకునేవారు. ప్రతి కొత్త విషయాన్ని ఆయన నుంచి తెలుసుకునేవాడిని. నా సినిమా షూటింగ్స్‌ జరిగే లొకేషన్స్‌కి సైతం ఆయన వచ్చి నాతో సరదాగా ముచ్చటించేవారు. నేను నటించిన ఎన్నో సినిమాలకు ఆయన పీఆర్‌వోగా వ్యవహరించారు. సినిమాల సమస్త సమాచారం.. ఎన్నో సంవత్సరాల క్రితం విడుదలైన క్లాసిక్స్‌కి సంబంధించిన కలెక్షన్స్‌, ట్రేడ్‌ రిపోర్ట్‌ రికార్డుల గురించి చెప్పగల గొప్ప నాలెడ్జ్‌ బ్యాంక్‌ ఆయన. ఏ సినిమా ఏ తేదీన విడులయ్యింది..? ఎంత వసూలు చేసింది? ఏ సెంటర్‌లో ఎన్నిరోజులు ఆడింది.. 100 రోజులు, 175 రోజులు, 200 రోజులు అంటూ ప్రతిదీ పరిశ్రమకు ఎన్‌సైక్లోపిడియాలా సమాచారం అందించేంత గొప్ప పత్రికా జర్నలిస్ట్‌.. మేధావి.. సూపర్‌హిట్‌ సినీ మ్యాగజైన్‌ కర్త, అనేక సినిమాల సక్సెస్‌లో కీలకపాత్ర పోషించిన బీఏ రాజుగారు లాంటి వ్యక్తి ఉండడం పరిశ్రమ అదృష్టం. అలాంటి వ్యక్తి నేడు లేరు! అన్న వార్త విని షాక్‌కి గురయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని.. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను’ అని చిరు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని